అంతర్జాతీయం

స్ఫూర్తిప్రదాత జీ జిన్‌పింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, అక్టోబర్ 24: సరికొత్త సామ్యవాద సిద్ధాంతాలతో నూతన శకంలోకి చైనాను పరుగులు పెట్టిస్తున్న అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మరో ఐదేళ్ల పదవీకాలాన్ని చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ ధ్రువీకరించింది. పార్టీ వ్యవస్థాపకులు మావో, ఆయన వారసుడు డెంగ్ జియావో పింగ్ స్థాయికి జీ జిన్‌పింగ్‌ను చేరుస్తూ ఆయన పేరును సిద్ధాంతాన్ని అందులో పొందుపరిచింది. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే అధికార కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ సమావేశాల ముగింపు సందర్భంగా ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. జీ జిన్‌పింగ్ సరికొత్త సిద్ధాంతం పార్టీకి మార్గదర్శకమని ఈ సందర్భంగా చేపట్టిన ఓ తీర్మానంలో స్పష్టం చేశారు. మావో, డెంగ్ స్థాయికి జీ జిన్‌పింగ్‌ను చేర్చడమన్నది ఆయన సిద్ధాంతాలకు పట్టం కట్టడంగానే భావిస్తున్నారు. ఇప్పటివరకు చైనా అధికార పార్టీ నియమావళిలో వీరిద్దరి పేర్లే ఉన్నాయి. మూడో పేరుగా జీ జిన్‌పింగ్ చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన జిన్‌పింగ్ చైనా ప్రజలకు, అలాగే దేశానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని అన్నారు. చైనా ప్రజలకు మరింత ఆత్మవిశ్వాసం తోడైందని, బాధ్యత కూడా పెరిగిందని జిన్‌పింగ్ అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న 2300మంది ప్రతినిధులు జిన్‌పింగ్ మరో ఐదేళ్ల పదవీకాలాన్ని ధ్రువీకరించారు. అలాగే కొత్త నాయకులను కూడా ఈ సందర్భంగా జిన్‌పింగ్ నియమించారు. రానున్న ఐదేళ్లపాటు పార్టీని ముందుకు నడిపించేందుకు కొత్త కేంద్రీయ కమిటీని కూడా ఈ సందర్భంగా నియమించారు. ఈ కమిటీయే దేశంలో రెండో అతి పెద్ద అధికార మండలి పొలిట్ బ్యూరోను ఎంపిక చేస్తుంది. రేపు జరిగే తొలి ప్లీనరీలో స్టాండింగ్ కమిటీని నియమించడంతోపాటు జనరల్ సెక్రటరీని కూడా నియమిస్తుంది.

చిత్రం..కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ సమావేశంలో వర్క్ రిపోర్ట్ ఆమోదం తీసుకుంటున్న దృశ్యం