అంతర్జాతీయం

సార్వభౌమత్వంపై రాజీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, అక్టోబర్ 25: చైనా సార్వభౌమత్వ విషయంలో రాజీ పడేది లేదని, దాని భద్రతను ప్రయోజనాలను పరిరక్షించుకుంటామని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఉద్ఘాటించారు. అధికార కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడుగా రెండోసారి ఎన్నికైన అనంతరం జాతీయ, అంతర్జాతీయ మీడియా ముందు మాట్లాడిన జిన్‌పింగ్ ఇతర దేశాలతో కలిసి ప్రపంచ భవితవ్యాన్ని నిర్మించేందుకు, జీవన పరిస్థితులను సురక్షితం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రపంచ శాంతి, మానవత్వ పరిరక్షణ కోసం ప్రతి దేశంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. చైనాను అత్యంత బలమైన శక్తిగా రూపొందించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. అధికార కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా బలమైన శక్తిగా మారాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆధునిక యుగంలో చైనా అభివృద్ధికి సంబంధించి తన ఆలోచనలను, సిద్ధాంతాలను జిన్‌పింగ్ ఆవిష్కరించారు. ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీగా కొనసాగుతున్న చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) దాని హోదాకు తగ్గట్టుగా ప్రవర్తించాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సభ్యులు వ్యవహరించాలని జిన్‌పింగ్ కోరారు. పార్టీ సభ్యులందరూ యువ స్ఫూర్తితో వ్యవహరించాలని, నిరంతరం ప్రజా సేవకులుగా పనిచేయాలని, దేశానికి వెనె్నముకగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇటీవల తాను చేపట్టిన అవినీతి వ్యతిరేక చర్యలను పరోక్షంగా ప్రస్తావించిన జిన్‌పింగ్ ఈ విషయంలో విశ్రమించడానికి వీల్లేదని, నిరంతర స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా జీ జిన్‌పింగ్ సారథ్యంలో సరికొత్త నాయకత్వాన్ని ఆవిష్కరించింది. రానున్న ఐదేళ్లపాటు జీ జిన్‌పింగ్ నాయకత్వాన్ని ధ్రువీకరించినప్పటికీ ఆయన తదుపరి వారసుడెవరన్న దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒకే వ్యక్తి మూడుసార్లు అధ్యక్ష పదవిని చేపట్టడమన్నది చైనా చరిత్రలో ఇప్పటివరకు లేనే లేదు. అలాగే చైనా అధికార పార్టీ అధ్యక్షుడుగా రెండోసారి కూడా జిన్‌పింగ్ ఎన్నికయ్యారు. పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీకి చెందిన ఐదుగురు సభ్యులను మీడియాకు పరిచయం చేశారు. చైనా పీపుల్స్ గ్రేట్ హాల్‌లో జరిగిన ఈ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ప్రసారమైంది.