అంతర్జాతీయం

వాళ్లూ మన మాదిరే!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, నవంబర్ 5: గ్రహాంతర జీవుల గురించి ఎన్నో కథలు, కథనాలు, ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. ఇవి ఎలా వుంటాయన్న దానిపై హాలివుడ్ సినిమాలూ వచ్చాయి. వీటికి సంబంధించి ఓ విడ్డూరమైన రూపాన్ని కూడా మనకు అందించాయి. కానీ తాజాగా ఆక్స్‌ఫర్డ్ జరిపిన అధ్యయనంలో ఈ గ్రహాంతర జీవులు మానవుల్లాగే ఉంటారన్న కొత్త అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. అంతర్జాతీయ ఖగోళ జీవశాస్త్ర పత్రిక ఇందుకు సంబంధించిన అధ్యయన వివరాలను ప్రచురించింది. జీవ పరిణామ సిద్ధాంతం ఆధారంగానే గ్రహాంతర జీవుల స్వరూపం గురించి అధ్యయనం చేయవచ్చునని, అలాగే వారి ప్రవర్తన ఎలా వుంటుందో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన శాస్తవ్రేత్తలు స్పష్టం చేశారు. మనుషులకు ప్రస్తుత రూపం రావడానికి ఏ రకమైన జీవ సహజ పరిస్థితులు దోహదం చేశాయో అలాంటి పరిస్థితులే గ్రహాంతర జీవుల ఆకృతిని ప్రభావితం చేసి ఉండవచ్చునని, ఒక రకంగా చెప్పాలంటే ఈ గ్రహాంతర జీవులు మనం అనుకున్నదానికంటే మనలాగే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. మనిషి ఏవిధంగా పరిణామ క్రమంలో ప్రస్తుత స్థితికి చేరుకున్నాడో, గ్రహాంతర జీవులు పరిణామ క్రమానికి లోనై మనిషి తరహా రూపాన్ని సంతరించుకుని ఉండే అవకాశం ఎంతైనా ఉంటుందని శాస్తవ్రేత్తలు వివరించారు.