అంతర్జాతీయం

‘తుపాకుల సమస్య’ కాదు: ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 6: టెక్సాస్ చర్చిలో నరమేధాన్ని అమెరికా అధ్య
క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఓ ఆగంతకుడు కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకోవడం కేవలం ‘చెడు చర్య’ తప్ప- అది ‘తుపాకుల సమస్య’ కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆసియాలో పనె్నండు రోజుల పర్యటన సందర్భంగా ట్రంప్ జపాన్‌లో ఉండగా టెక్సాస్ దుర్ఘటన జరిగింది. ‘దేవుని సన్నిధిలో ప్రార్థనలు జరుపుతున్న వారిపై కాల్పులు జరపడం బాధాకరం.. మృతుల కుటుంబాలు ఎంతటి విషాదాన్ని ఎదుర్కొంటున్నాయో చెప్పడానికి మాటలు చాలవు.. ఈ బాధ ఏ స్థాయిలో ఉంటుందో మనం ఊహించలేం..’ అని ట్రంప్ అన్నారు. ఇలాంటి సమయంలో అమెరికన్లు ధైర్యంగా, ఐకమత్యంతో ఉండాలని ట్రంప్ పిలుపునిచ్చారు. స్థానిక యంత్రాంగానికి అన్ని విధాలా అండగా ఉంటామని, సమగ్ర విచారణలో వాస్తవాలన్నీ వెలుగు చూస్తాయని ఆయన పేర్కొన్నారు. టెక్సాస్ గవర్నర్ అబ్బట్‌తో తాను ఫోన్‌లో మాట్లాడానని, ఆగంతకుడిని నిలువరించేందుకు ప్రయత్నించి, ఈ దుర్ఘటనపై వెంటనే స్పందించినవారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని ట్రంప్ అన్నారు.