అంతర్జాతీయం

మసూద్ దుష్టుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 8: మసూద్ అజార్ దుష్టుడు. పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న జైషే-ఇ-మహ్మద్ చీఫ్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తించి తీరాల్సిందే’ అని అమెరికా స్పష్టం చేసింది. పటాన్‌కోట్ ఉగ్రదాడి వ్యూహకర్త మసూద్ అజార్‌పై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి విధించిన నిషేధ ప్రతిపాదనపై చైనా అభ్యంతరం చెప్పి రోజులు గడవకుండానే అమెరికా తీవ్రంగా స్పందించింది. మసూద్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా పరిగణించాలంటూ గతవారం అమెరికా చేసిన ప్రతిపాదనను ఫ్రాన్స్, బ్రిటన్‌లు సమర్థిస్తే, చైనా అభ్యంతరం చెప్పడం తెలిసిందే. దీంతో అల్‌ఖైదాపై నిషేధం విధించాలన్న అంశంపై భద్రతా మండలి సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ‘జైషే-ఇ-మహ్మద్ వ్యవస్థాపకుడు అజార్ భయంకర ఉగ్రవాది అన్న విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అతన్ని హిట్‌లిస్ట్‌లో ఉంచాల్సిందే’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హీథర్ నౌరట్ వెల్లడించారు. ‘మసూద్‌ను హిట్ లిస్ట్‌లో పెట్టాలన్న అంశంపై చైనా ఎందుకు విభేదిస్తుందో ప్రపంచానికి చెప్పితీరాలి. చైనా వ్యతిరేకించినా, మసూద్ మాత్రం ప్రపంచ ఉగ్రవాదే’ అని నౌరట్ వ్యాఖ్యానించారు.