అంతర్జాతీయం

లిబియాలో పాగాకు ఐసిస్ యత్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షర్మ్ ఎల్-షేక్ (ఈజిఫ్ట్), నవంబర్ 9: ఇరాక్, సిరియాల్లో పరాభవం చెందిన ఐసిస్ ఉగ్రవాదులు ఇపుడు లిబియా తమకు క్షేమకరమైన స్థావరంగా భావిస్తున్నారని ఈజిఫ్ట్ అధ్యక్షుడు అబ్డెల్- ఫతాహ్‌ఎల్-సిస్సీ తెలిపారు. లిబియా చేరుకున్న అనంతరం ఈజిఫ్ట్‌లోకి ప్రవేశించాలన్నది ఉగ్రవాదుల పథకమని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమ సేనలు ఇప్పటికే సినై ద్వీపకల్పం ప్రాంతంలో మిలిటెంట్లతో తలపడుతున్నాయని వివరించారు. ఉగ్రవాద చర్యలను తిప్పికొట్టేందుకు ఈజిఫ్ట్ ఇప్పటికే అధునాతన ఆయుధాలను సమకూర్చుకుందన్నారు. ఐసిస్ విధ్వంసక చర్యల వల్ల పొరుగు దేశాలైన ఇరాక్, సిరియా, లిబియా, యమెన్ దేశాలు ఇబ్బందుల పాలైనట్టు ఆయన గుర్తు చేశారు. రాఫెల్ ఫైటర్ జెట్‌లు, హెలికాప్టర్లను తీసుకువెళ్లే వాహకాలను, మిగ్-29 ఫైటర్ జెట్‌లను, సబ్ మెరైన్లను ఫ్రాన్స్, రష్యా, జర్మనీల నుంచి ఈజిఫ్ట్ సమకూర్చుకుంటోంది. అన్ని రకాలుగా సాయుధ సంపత్తిని పెంచుకునేందుకు 2014 నుంచి దాదాపు పది కోట్ల అమెరికన్ డాలర్లను ఈజిఫ్ట్ ఖర్చు చేసింది. అమెరికా నుంచి వార్షిక సహాయం కింద 1.3 కోట్ల బిలయన్ డాలర్లను ఈ దేశం పొందుతోంది. కాగా, ఐసిస్ ఉగ్రవాదుల కదలికల గురించి పూర్తి వివరాలను వెల్లడించడానికి ఈజిఫ్ట్ అధ్యక్షుడు నిరాకరిస్తూనే, ఉగ్రవాదులు సహజంగానే లిబియా వైపు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రాంతీయ అసమానతలను, ఉగ్రవాదాన్ని ఎదిరించాలంటే తప్పనిసరిగా సైనిక బలాన్ని పెంచుకోవాల్సి ఉంటుందన్నారు. ఉగ్రవాదుల బెడద తమ ఒక్క దేశానికే లేదని, యూరప్ మొత్తం ఈ సమస్యను ఎదుర్కొంటోందన్నారు.