అంతర్జాతీయం

ప్రియురాలిపై దాడిచేసిన వ్యక్తిపై పోలీసు కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డల్లాస్ (అమెరికా), జూన్ 11: అమెరికాలోని డల్లాస్ విమానాశ్రయం వెలుపల ఒక వ్యక్తి తన పిల్లల తల్లిగా భావిస్తున్న ఒక మహిళపై దాడికి పాల్పడటం తోపాటు అతడిని అడ్డుకోబోయిన పోలీసు అధికారిని రాళ్లతో బెదిరించాడు. దీంతో ఆ పోలీసు అధికారి అతనిపై కాల్పులు జరిపి గాయపర్చాడు. మాజీ ప్రియురాలితో కలసి శుక్రవారం కారులో డాలస్ విమానాశ్రయానికి చేరుకున్న షాన్ నికోలస్ డైమండ్ అనే వ్యక్తి ఉన్నట్టుండి ఆమెపై దాడికి తెగబడటంతోపాటు రెండు చేతుల్లోకి రాళ్లను తీసుకుని పోలీసు అధికారిని బెదిరించాడని, దీంతో అతనిపై ఆ అధికారి కాల్పులు జరిపాల్సి వచ్చిందని డేవిడ్ బ్రౌన్ అనే పోలీసు ఉన్నతాధికారి వెల్లడించాడు. ఈ కాల్పుల్లో గాయపడిన డైమండ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగిందని, ప్రస్తుతం అతని పరిస్థితి స్థిమితంగానే ఉందని బ్రౌన్ తెలిపాడు.