అంతర్జాతీయం

తీరు మారకపోతే మూల్యం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 22: ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తే తగిన మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుందని పాకిస్తాన్‌ను అమెరికా హెచ్చరించింది. ఇప్పటికే పలుమార్లు పాక్ చర్యలను వ్యతిరేకిస్తున్న అమెరికా తాజాగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల జాబితాలో పాకిస్తాన్‌ను చేర్చింది. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ శుక్రవారం వెల్లడించారు. ఆఫ్గనిస్తాన్ పర్యటనలో ఉన్న పెన్స్ ఆ దేశ బలగాలను ఉద్దేశించి ప్రసంగించారు. తాలిబన్ వంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ స్వర్గ్ధామంగా మారిందని ఆయన అన్నారు. పాకిస్తాన్‌ను అధ్యక్షుడు ట్రంప్ నోటీసులో చేర్చారని, ఇక వారి ఆటలు సాగవని ఉపాధ్యక్షుడు తీవ్రంగా హెచ్చరించారు. అమెరికా సహాయంతో ఎంతో ప్రయోజనం పొందిన పాకిస్తాన్ తన తీరుమార్చుకోకుండా ఉగ్రవాదులు, నేరస్తులతో అంటకాగితే తీవ్రంగా నష్టపోవల్సి వస్తుందని పెన్ చెప్పారు. పాకిస్తాన్‌ను ఎలా కట్టడి చేయాలో తమకు తెలుసున్న పెన్ ‘ఇప్పటికే అమెరికా బలగాలు పాకిస్తాన్ చేరుకున్నాయి. ఉగ్రవాదులు ఎక్కడ దాగినా బలగాలు విడిచిపెట్టవు. శత్రువులను తుదముట్టించే స్వేచ్ఛ మా బలగాలకు ఇచ్చాం. వారిపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు’ అని అమెరికా ఉపాధ్యక్షుడు ప్రకటించారు. ఉగ్రవాద నిర్మూలనలో ఆఫ్గనిస్తాన్‌కు బాసటగా నిలుస్తామని పెన్ భరోసా ఇచ్చారు.