అంతర్జాతీయం

పాక్‌లో 145 మంది భారత జాలర్లకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, డిసెంబర్ 28: తమ ప్రాదేశిక జలాల్లో చేపల వేట చేస్తున్నారన్న అభియోగంపై పాకిస్తాన్ నిర్బంధించిన భారత జాలర్లలో 145 మందికి విముక్తి లభించింది. పాక్, భారత్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నప్పటికీ భారత జాలర్లను దాయాది దేశం విడిచిపెట్టడం గమనార్హం. ఇస్లామాబాద్ జైలులో ఉన్న భారత నావికాదళం మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌ను అతని కుటుంబ సభ్యులు కలిసిన సందర్భంగా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ గత వారం చేసిన ప్రకటనను పురస్కరించుకుని భారత జాలర్లను విడిచిపెట్టినట్లు పాక్ విదేశాంగ కార్యాలయం అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ తెలిపారు. పాక్ నిర్బంధంలో ఉన్న 291 మంది భారత జాలర్లను రెండు విడతల్లో జనవరి 8లోగా విడుదల చేస్తారు. మలిర్ జైలు నుంచి కట్టుదిట్టమైన భద్రతతో 145 మంది భారత జాలర్లను గురువారం నాడు కరాచీ కంటోనె్మంటు రైల్వే స్టేషన్‌కు తీసుకువచ్చారు. అక్కడి నుంచి వారిని లాహోర్‌కు తీసుకెళతారని ఓ పోలీసు అధికారి తెలిపారు. మిగతా 146 మంది జాలర్లను వచ్చే నెలలో భారత్‌కు పంపిస్తారు. విడుదలైన జాలర్లకు ఈదీ ఫౌండేషన్ ప్రతినిధులు బహుమతులను, కొంత నగదును అందజేశారు. అరేబియన్ సముద్రంలో స్పష్టమైన సరిహద్దులు లేనందున భారత్, పాక్ తమ తమ ప్రాదేశిక జలాల్లో ప్రవేశించే జాలర్లను నిర్బంధిస్తున్నాయి. అయిదువారాల క్రితం పాక్ సముద్ర గస్తీ సైనికులు 168 మంది భారత జాలర్లను అరెస్టు చేశాయి.