అంతర్జాతీయం

శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త పుంతలు (గుర్తుకొస్తున్నాయి 2017)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాస్త్ర,సాంకేతిక విజ్ఞానంలో ప్రపంచం కొత్తపుంతలు తొక్కింది. 2017 వీడ్కోలు పలుకుతూ సరికొత్త శాస్తవ్రిజ్ఞాన సౌరభాలను అందించింది. రోదసికి సంబంధించి ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరిగాయి. మన సౌరవ్యవస్థను దాటిన పరిశోధకులు ఎన్నో కొత్త గ్రహాలను కనిపెట్టారు. అలాగే రానున్న కాలంలో మరికొన్ని ఆవిష్కరణలకు బలమైన పునాదులు వేశారు.

క్యాసినీకి గుడ్‌బై
ప్రపంచ దేశాలు ప్రయోగించిన ఎన్నో వ్యోమనౌకల్లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా చేపట్టిన క్యాసినీ వ్యోమనౌక ప్రయోగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా శనిగ్రహ వ్యవస్థను కరతలామలకం చేసుకోవాలన్న విస్తృత లక్ష్యంతో 2004లో ఈ వ్యోమనౌకను ప్రయోగించారు. ముఖ్యంగా వలయాల మధ్య ఉన్నట్టుగా కనిపించే శనిగ్రహంతో పాటు దానికి సంబంధించిన ఎన్నో ఉపగ్రహాల ఆనుపానులను ఈ వ్యోమనౌక ద్వారా తెలుసుకోగలిగారు. దాదాపు 13 సంవత్సరాల పాటు శనిగ్రహానికి సంబంధించిన సమస్త వివరాలను కళ్లకు కట్టిన ఈ వ్యోమనౌక ఇంధన అయిపోవడంతో ఈ గ్రహ వాతావరణంలోకి జారుకుని తునాతునకలైంది. ఆ దశలో కూడా ఈ స్వయం విధ్వంస సంకేతాలను సైతం ఈ వ్యోమనౌక అందించడం దాని ప్రత్యేకతకు నిదర్శనం.
గురుత్వాకర్షక తరంగాలు
ప్రపంచ ప్రఖ్యాత శాస్తవ్రేత్త ఐన్‌స్టీన్ ఏనాడో ప్రవచించిన గురుత్వాకర్షణ తరంగాల మూలాలను కొత్త మార్గంలో శాస్తవ్రేత్తలు కనిపెట్టారు. రెండు మృత నక్షత్రాలు లేదా న్యూట్రాన్ నక్షత్రాలు పరస్పరం ఢీకొనడం వల్ల కూడా ఈ గురుత్వాకర్షణ తరంగాలు ఏర్పడతాయని నిర్ధారించారు. ఈ తరంగాలను ఆసరా చేసుకుని రోదసి లోతుల్లోకి వెళ్లి ఎన్నో అతి ప్రాచీన నక్షత్రాలు, గ్రహాల వివరాలను సేకరించవచ్చని చెబుతున్నారు.
పర్యావరణానికి తూట్లు
కాలుష్య, కర్బన ఉద్గారాల విసర్జనతో పర్యావరణం తల్లడిల్లిపోతోంది. ఫలితంగా వాతావరణం వేడెక్కిపోయి ఉష్ణోగ్రత కూడా జీవజాతులు తాళలేని స్థాయికి చేరుకుంది. దీనికి విరుగుడుగా కర్బన ఉద్గారాల పరిమాణాన్ని తగ్గించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ నడుం బిగించేందుకు చారిత్రక రీతిలో అమలులోకి వచ్చిన ‘పారిస్ ఒప్పందాని’కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తూట్లు పొడిచారు. ఈ ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించడం ద్వారా పర్యావరణ సమతూక పరిరక్షణకు తీవ్ర విఘాతమే కలిగించారు. దీనిపై ప్రపంచ దేశాలన్నీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో పాటు ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టాయి. మొత్తమీద తగ్గిన ట్రంప్ తమ షరతులకు లోబడి మాత్రమే పర్యావరణ సమతూక పరిరక్షణకు కట్టుబడి ఉంటామనడం విడ్డూర పరిణామమే.
అమెరికాలో అద్భుతం
గత కొన్ని వందల సంవత్సరాలుగా ఎన్నడూలేని ఓ అద్భుత ఖగోళ దృశ్యాన్ని అమెరికన్లు తిలకించారు. 1776లో సంభవించిన తర్వాత తొలిసారిగా అమెరికా యావత్తూ అంధకారమయంగా మారింది. ఆగస్టు 21న సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించడంతో ఒక్కసారిగా ప్రజలందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఈ ఏడాదిలో అత్యద్భుతమైన ఖగోళ పరిణామంగా దీన్ని పేర్కొనవచ్చు.
కోకొల్లలుగా కొత్త గ్రహాలు
రోదసి లోతుల్లోకి ఎంతగా వెళితే అంతగాను ఊహాతీతమైన కొత్త ప్రపంచం కళ్లకు కడుతుంది. ఈ విశ్వంలో సమస్త జీవజాతులు మనుగడ సాగించగలిగే సమశీతోష్ణ వాతావరణం ఒక్క భూమిమీదే ఉందన్నది ఇప్పటివరకూ ప్రతి ఒక్కరూ భావిస్తూ వచ్చారు. కానీ భూమిని పోలిన, భూ వాతావరణం కలిగిన, భూ పరిమాణంతో కూడిన గ్రహాలు కూడా ఎన్నో ఉన్నాయని ఖగోళవేత్తలు కనిపెట్టారు. మొత్తం ఏడు గ్రహాలు భూమిని పోలిన లక్షణాలతో ఓ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న అంశాన్ని కూడా వెలుగులోకి తెచ్చారు. ఇవన్నీ కూడా జీవజాతులకు ఆవాస యోగ్యమైనవి కావడం అలాగే సమశీతోష్ణతను కలిగి ఉండడం వీటి ప్రత్యేకతగా వెల్లడించారు. ముఖ్యంగా వీటి ఉపరితలాలపై ద్రవ రూప జలాలున్నాయని పేర్కొనడంతో వీటిలో కూడా జీవజాతులు మనుగడ సాగించవచ్చన్న వాదనకు బలం చేకూరింది.