అంతర్జాతీయం

రోహింగ్యాల ఆర్తనాదం (గుర్తుకొస్తున్నాయి 2017)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నచోట ఉండలేని, అన్య ప్రాంతాల్లో దిక్కూమొక్కూలేని దయనీయ పరిస్థితిలో మైన్మార్ మైనార్టీ ముస్లిం రోహింగ్యాలు సతమతమైపోయారు. దేశంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం అహరహం పోరాడిన అంగ్‌సాన్ సూకీ కూడా వీరి విషయంలో ఏమీ చేయలేకపోయింది. మైన్మార్‌లో సైనిక దాడులు తాళలేక లక్షల సంఖ్యలోనే రోహింగ్యాలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు తరలిపోయారు. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శరణార్థ శిబిరాల్లో అమానుష పరిస్థితుల్లోనే వారు కాలం గడుపుతున్నారు. స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు మైన్మార్-బంగ్లాల మధ్య ఒప్పందం కుదిరినా అందుకు రోహింగ్యాలు ఎంత మేరకు సిద్ధమవుతారన్నది ప్రశ్నార్ధకంగానే కనిపిస్తోంది.