అంతర్జాతీయం

పాక్ మంత్రిపై సరుూద్ పరువు నష్టం దావా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జనవరి 6: తన పరువుకు నష్టం కలిగించినందుకు 100 మిలియన్ రూపాయలు చెల్లించాలంటూ అంతర్జాతీయ ఉగ్రవాది, జమాత్-ఉద్-దవా (జెయుడి) అధినేత హఫీజ్ సరుూద్ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖుర్రమ్ దస్తగిర్‌కు లీగల్ నోటీసు పంపాడు. ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం కల్పిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాక, విరాళాల సేకరణకు సంబంధించి జెయుడిపై పాక్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం విధించిన నాలుగు రోజులకే పాక్ రక్షణమంత్రికి సరుూద్ పరువునష్టం నోటీసు ఇచ్చాడు. 14 రోజుల్లోగా రక్షణమంత్రి క్షమాపణ చెప్పాలని, భవిష్యత్‌లో ‘జాగ్రత్త’గా ఉంటానని హామీ ఇవ్వాలని, ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 500 ప్రకారం చట్టపరమైన చర్యలు తప్పవని ఆ లీగల్ నోటీస్‌లో సరుూద్ తరఫున న్యాయవాది ఏకే దొగార్ హెచ్చరించారు. ముంబయి పేలుళ్లకు సూత్రధారి అయిన హఫీజ్ సరుూద్‌ను ఇటీవల గృహనిర్బంధం నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసింది. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో జెయుడి, ఎఫ్‌ఐఎఫ్ వంటి ఉగ్రవాద సంస్థలు విరాళాలు వసూలు చేయడాన్ని నిషేధిస్తూ గత సోమవారం పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గ్ధామంలా మారిందని, ఆ దేశానికి నిధుల కేటాయింపును నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించారు. లష్కర్-ఇ- తైబాతో జెయుడికి ఎలాంటి సంబంధాలు లేవని, సరుూద్‌పై ఐక్యరాజ్యసమతి చేసిన తీర్మానాలు చట్టవిరుద్ధమని న్యాయవాది దొగార్ పేర్కొన్నారు. జెయుడిపై బాధ్యతారాహిత్యమైన ప్రకటన చేసి పాక్ రక్షణమంత్రి హఫీజ్ సరుూద్ పరువుకు తీవ్ర నష్టం కలిగించారని లీగల్ నోటీస్‌లో పేర్కొన్నారు. అమెరికా ఒత్తిడికి లొంగి జెయుడి, ఎఫ్‌ఐఎఫ్‌లపై పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకుంటుందని దొగార్ ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితిలోని భద్రతామండలి తీర్మానాల మేరకు విరాళాలు సేకరించరాదని జెయుడి,ఎఫ్‌ఐఎఫ్‌లపై పాక్ నిషేధం విధించింది. ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్చ్‌చేంజి కమిషన్ ఆఫ్ పాకిస్తాన్’ (ఎస్‌ఈసీపీ) కూడా జెయుడి, లష్కరే వంటి సంస్థలు విరాళాలను సేకరించరాదని ప్రకటన జారీ చేసింది.

చిత్రం..హఫీజ్ సరుూద్