అంతర్జాతీయం

చెప్పుల దొంగ పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 8: అమెరికాలో పాక్ రాయబార కార్యాలయం వద్ద ఇండియా, ఆఫ్గాన్, బలోచ్ సంతతికి చెందిన ప్రజలు సోమవారం పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ‘చెప్పుల దొంగ పాకిస్తాన్’ పేరిట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాక్ అంబసీ అధికారులకు పెద్దఎత్తున చెప్పులు సమర్పించే ప్రయత్నం చేశారు. పాక్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ మాజీ నావికుడు కులభూషణ్ యాదవ్‌ను చూసేందుకు ఆయన కుటుంబం ఇస్లామాబాద్ వచ్చిన సందర్భంలో పాక్ అధికారులు అనుసరించిన అమానవీయ తీరుపై నిరసనకారులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గడ్డకట్టే చలిలోనే పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఆందోళనలో భాగంగా పాక్ రాయబార కార్యాలయ అధికారులకు చెప్పులు సమర్పించేందుకు ప్రయత్నించారు. కులభూషణ్ యాదవ్‌ను విచారించటంలో పాక్ మిలటరీ కోర్టు అంతర్జాతీయ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కిందంటూ నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించిన అమెరికన్ ఫ్రెండ్స్ ఆఫ్ బలూచిస్తాన్ వ్యవస్థాపకుడు అహ్మర్ ముస్తిఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పుట్టెడు దుఃఖంతో జాదవ్‌ను చూడటానికి వచ్చిన తల్లి, భార్యను పాక్ అధికారులు మానసికంగా హింసించారు. చెప్పులు తీసేయమన్నారు. భార్య మెడలో మంగళ సూత్రాలు తీసేశారు. చివరకు నుదుటిన బొట్టు కూడా చెరిపేసి జాదవ్‌ను కలిసేందుకు అనుమతించారు. బయటకు వచ్చేసరికి ఇద్దరి చెప్పులను పాక్ అధికారులు దొంగిలించారు. ఇంతటి అమానవీయ పరిస్థితి ఎక్కడా ఉండదు’ అంటూ ముస్తిఖాన్ ఆగ్రహించారు. పెద్దఎత్తున ఏర్పాటుచేసిన సెక్యూరిటీ గదిలో అద్దానికి ఆవలివైపు నుంచే కుటుంబంతో జాదవ్‌ను మాట్లాడించటాన్ని ప్రస్తావిస్తూ ‘పాక్ విడుదల చేసిన దృశ్యాలను చూస్తే ఆ దేశంలో మానవత్వం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. పవిత్రమైన మంగళసూత్రాలు, నుదుటిను బొట్టును తీయించేయడాన్ని చూస్తే, భారత సౌభాగ్యనారిని పాక్ ఎంతగా అవమానించిందో అర్థమవుతుంది’ అంటూ యూఎస్‌లో హిందూ కమ్యూనిటీ నాయకుడు కృష్ణ గుడిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పాక్ తన వైఖరితో హిందూత్వ నమ్మకాన్ని అవహేళన చేసింది. మానవత్వం ఎంతగా దిగజారిపోయిందో పాక్ అధికారులు ప్రత్యక్షంగా చూపించారు. పాక్ వైఖరిని ప్రపంచ దేశాలు గర్హించాలి’ అంటూ నిరసన కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులు డిమాండ్ చేశారు.