అంతర్జాతీయం

‘మృత్యుంజయుడి’లో ఉద్వేగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలేం, జనవరి 8: మోషే హోల్జ్‌బెర్గ్ ఇజ్రాయెల్‌కు చెందిన 11 ఏళ్ల బాలుడు.. రెండేళ్ల ప్రాయంలో ఉండగా 2008 నవంబర్ 26న జరిగిన ముంబయి పేలుళ్ల ఘటనలో క్షేమంగా బయటపడి తన సొంత దేశం చేరుకున్నాడు.. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌ను సందర్శించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి వస్తున్నాడు.. ముంబయిలో పుట్టిన ఈ బాలుడు తన జన్మస్థలాన్ని చూసేందుకు వస్తున్నందుకు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు.. భారత్‌ను సందర్శించేందుకు ఎంతో ఆతృతతగా ఎదురుచూస్తున్నాడు..
ముంబయిలోని నారీమన్ హౌస్ (్ఛబద్ హౌస్) వద్ద పాకిస్తాన్‌కు చెందిన లష్కరే సంస్థ ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న బాంబులు పేల్చినపుడు మోషే తల్లిదండ్రులు మరణించారు. అప్పుడు రెండేళ్ల వయసున్న మోషేను అతని బామ్మ సాంద్రా శామ్యూల్స్ ప్రాణాలకు తెగించి కాపాడింది. ఓ గది మెట్లకిందకు మోషేను ఆమె తీసుకువెళ్లడంతో అతను సురక్షితంగా బయటపడ్డాడు. ముంబయిలో పుట్టిన మోషే ఇన్నాళ్లకు మళ్లీ తన జన్మస్థలాన్ని చూసేందుకు భారత్‌కు వెళుతూ ఎంతో భావోద్వేగానికి లోనైనట్లు అతని తాత రబ్బీ షిమన్ చెబుతున్నారు.
గత ఏడాది జూలై 5న జెరూసలేంలో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీని మోషే కలుసుకుని, తనకు భారత్‌ను సందర్శించాలని ఉందన్న ఆకాంక్షను తెలిపాడు. ‘నాకు ముంబయిని చూడాలని ఉంది.. నేను పెద్దయ్యాక అక్కడే నివసిస్తా..’ అని మోషే ప్రధాని మోదీకి తెలిపాడు. మోషే మాటలకు నరేంద్ర మోదీ వెంటనే స్పందిస్తూ, భారత్‌ను సందర్శించేందుకు ఎప్పుడైనా రావచ్చునని ఆహ్వానించారు. మోషేకు, అతని కుటుంబ సభ్యులకు దీర్ఘకాలిక వీసాలు మంజూరు చేస్తామని ప్రకటించారు. మోదీని కలిసినపుడు అక్కడే ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్సాహూ కూడా సానుకూలంగా స్పందించారు. తాను భారత్ పర్యటనకు వెళ్లినపుడు తన వెంట రావాలని మోషేకు చెప్పారు. ఆ హామీ మేరకు నెతన్యాహూ పర్యటనలో మోషే పాల్గొనేలా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 15న ముంబయి చేరుకుని తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటానని మోషే చెబుతున్నాడు. తన పర్యటన సందర్భంగా భారత ప్రధానిని కలుసుకుని కృతజ్ఞతలు తెలియజేస్తానని అంటున్నాడు. ముంబయిలోని ప్రముఖ ప్రాంతాలతో పాటు తన తల్లిదండ్రులు నివసించిన ఇంటిని చూసేందుకు మోషే వస్తున్నాడు. ఛాబద్ హౌస్‌లో డైరెక్టర్లుగా పనిచేసిన మోషే తల్లిదండ్రులు రబ్బీ గవ్రీల్ రివ్కా హోల్జ్‌బర్గ్ ముంబయి పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయారు. ఛాబద్ హౌస్‌లో డైరెక్టర్‌గా పనిచేయాలన్నదే తన ఆకాంక్ష అని మోషే అంటున్నాడు. రెండేళ్ల ప్రాయంలో మోషేను కాపాడిన అతని బామ్మ సాంద్రా సైకాలజిస్టుగా ఇజ్రాయల్‌లో సేవలందిస్తున్నారు. ఆమెకు ఇజ్రాయల్ ప్రభుత్వం గౌరవ పౌరసత్వాన్ని మంజూరు చేసింది.
చిత్రం..ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నప్పుడు కలిసిన మోషే హోల్జ్‌బెర్గ్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (ఫైల్ ఫొటో)