అంతర్జాతీయం

క్షిపణి ప్రయోగాలకు కిమ్ స్వస్తి చెప్పాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 8: చర్చల ప్రక్రియ ప్రారంభించాలంటే ఉత్తర కొరియా క్షిపణలు, అణ్వస్త్రాల ప్రయోగాలకు స్వస్తి పలకాలని ఐక్యరాజ్యసమితిలోని ఇండో-అమెరికన్ రాయబారి నిక్కీ హేలీ తేల్చిచెప్పారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో ఫోన్‌లో మాట్లాడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనకు స్పందిస్తూ, అణుయుద్ధం వస్తే ప్రపంచం ఏమవుతుందో అన్న విషయాన్ని కిమ్ తెలుసుకోవడం లేదన్నారు. అమెరికాలోని ఏ ప్రాంతంపైనైనా దాడి చేసేందుకు అణ్వస్త్రాలను ప్రయోగించేలా తన టేబుల్‌పై ‘బటన్’ ఉందని కిమ్ చేసిన హెచ్చరికకు దీటుగా- ‘అంతకన్నా పెద్ద బటన్ తన గదిలో ఉంద’ని ట్రంప్ పేర్కొనడాన్ని నిక్కీ సమర్థించారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా కిమ్ హెచ్చరికలు చేస్తున్నప్పటికీ, ఉత్తర కొరియా అధ్యక్షుడితో చర్చలకు సిద్ధమేనని ట్రంప్ ట్వీట్ చేశారని ఆమె గుర్తు చేశారు. ‘కిమ్‌ను కాళ్లమీద నిలబెట్టేలా’ ట్రంప్ వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. చర్చలకు సిద్ధమని ట్రంప్ ప్రకటించడం శుభపరిణామమే అయినా, అందుకు తగ్గట్టుగా కిమ్ కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. క్షిపణలు, అణ్వస్త్రాల ప్రయోగాలను నిలిపివేస్తేనే చర్చలకు మార్గం సుగమమవుతుందన్నారు.
కిమ్‌తో చర్చలకు సిద్ధమంటూ ట్రంప్ ప్రకటించడాన్ని ‘అమెరికా విధానాల్లో మార్పుగా భావించాలా?’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా- ‘మేం వెనక్గి తగ్గడం అన్న ప్రసక్తే లేదు.. ట్రంప్ చెప్పింది సబబే.. ఉత్తర కొరియాతో చర్చలు జరపాల్సిన సమయం అంటూ ఒకటి వస్తుంది.. అయితే అణ్వాయుధాలపై నిషేధం విధిస్తున్నట్లు కిమ్ స్పష్టం చేయాల్సి ఉంటుంది.. ఇవన్నీ జరిగితేనే చర్చలకు అవకాశం ఉంటుంది..’ అని నిక్కీ స్పష్టం చేశారు. ‘పాతికేళ్ల జరిగిన దానిని పునరావృత్తం చేయాలని మేం భావించడం లేదు.. చర్చల పేరిట ఒక చోట సమావేశం కావడం, మేం నిధులు కేటాయించడం.. సహాయం పొందినవారు చివరికి మోసం చేయడం.. ఇవన్నీ ఇకముందు ఉండవు’ అన్నారు. ‘అమెరికాను భద్రంగా ఉంచడానికి మేం ఏం చేశామో కొరియా ద్వీపకల్పాన్ని అణురహిత ప్రాంతంగా మార్చాలన్నదే మా ధ్యేయం..’ అని ఆమె అన్నారు.