అంతర్జాతీయం

గ్రీన్‌కార్డులకు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 11: అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలని భావించే భారతీయ ఐటీ నిపుణులకు ప్రయోజనం కలిగించే పరిణామం ఇది. ‘ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని’ ప్రోత్సహించేలా ఏడాదికి 45 శాతం గ్రీన్‌కార్డులను మంజూరు చేసేందుకు అమెరికా ప్రతినిధుల సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ బిల్లు ఆమోదం పొంది, చట్టరూపంలో అమలులోకి వస్తే ప్రస్తుత సంవత్సరానికి గ్రీన్‌కార్డుల సంఖ్య లక్షా 20వేల నుంచి లక్షా 75వేల వరకూ పెరిగే అవకాశం ఉంది. ‘అమెరికా భవిష్యత్ భద్రత చట్టం’ పేరుతో ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ఈ బిల్లును అమెరికన్ కాంగ్రెస్ ఆమోదిస్తే గ్రీన్‌కార్డుల మంజూరుకు సంబంధించి సమగ్రరూపం ఏర్పడుతుంది. దీంతో ఏటా వచ్చే వలసదారుల సగటు సంఖ్య తగ్గే వీలుంటుందని అంచనా వేస్తున్నారు. కొత్త చట్టం వల్ల ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయి.
ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బిల్లు చట్టంగా మారితే వీసాలకు సంబంధించి అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని, తమ దేశం అంతర్గతంగా మరింత బలోపేతం అవుతుందని, వలస సంబంధిత చట్టాలను ఉల్లంఘించేవారి పట్ల కఠిన నిబంధనలు అమలవుతాయని ‘సెక్యూర్ అమెరికా ఫ్యూచర్ యాక్ట్’ కమిటీ చైర్మన్ మిచెల్ అంటున్నారు. ఒకరి ద్వారా మరొకరు వలస రావడం కూడా తగ్గుముఖం పడుతుందని ఆయన విశే్లషిస్తున్నారు. ఉదాహరణకు ఉద్యోగాల నిమిత్తం అమెరికా వచ్చే భారతీయ ఐటీ నిపుణులు తమ వెంట కుటుంబ సభ్యులను కూడా తీసుకువస్తుంటారు. కొత్త చట్టంలో ఇలా వలస వచ్చే కుటుంబ సభ్యులకు ఇకపై గ్రీన్‌కార్డులు కేటాయించరాదని ప్రతిపాదించారు. అమెరికాలో పనిచేసే విదేశీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు, పిల్లలకు, తోబుట్టువులకు మాత్రమే గ్రీన్‌కార్డు సౌకర్యం వర్తిస్తుంది. గ్రీన్‌కార్డుల కోసం ఏటా సుమారు 5లక్షల మంది భారతీయులు తమ హెచ్-1బీ వీసాలను పొడిగించుకుంటున్నారు. దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్నా చాలామందికి గ్రీన్‌కార్డులు దక్కడం లేదు. స్థానికంగా నిపుణుల కొరత ఉన్నందున అమెరికాలోని అనేక ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసాల పేరిట భారత్ వంటి ఇతర దేశాల నుంచి నిపుణులను రప్పించుకుంటున్నాయి. అమెరికా ప్రభుత్వం ఏటా గ్రీన్‌కార్డుల కేటాయింపును సక్రమంగా కొనసాగిస్తే గనుక హెచ్-1బీ వీసాలను పొడిగించవలసిన అవసరం ఉండదు.