అంతర్జాతీయం

భారత్, చైనా తోడ్పాటు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జనవరి 13: పర్యావరణ పరిరక్షణలో ఇతర దేశాలు విఫలమవుతున్న నేపథ్యంలో వాతావరణ సమతూకాన్ని కాపాడే విషయంలో భారత్, చైనాలు అద్భుతమైన నాయకత్వ పటిమను, నిబద్ధతను కనబరుస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. పర్యావరణ సమతూకాన్ని పరిరక్షించుకునే విషయంలో ఐరాస గురుతరమైన రీతిలోనే తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోందని సెక్రటరీ జనరల్ ఆంటోనియా గటెరస్ స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావం వల్ల ఆఫ్రికా దేశాలు తీవ్రస్థాయిలో నష్టపోతున్నాయని పేర్కొన్న ఐరాస సెక్రటరీ జనరల్ ‘వాతావరణ మార్పుల నిరోధన విషయంలో మనం ఓడిపోకూడదు. ఈ విషయంలో నిరంతర ప్రయత్నం ద్వారా అంతిమ విజయాన్ని చేకూర్చుకునేందుకు సన్నద్ధం కావాలి’ అని వెల్లడించారు. 77 దేశాల జి-77 నాయకత్వ బాధ్యతను ఈజిప్ట్ చేపట్టిన సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో గటెరస్ మాట్లాడారు. ఇప్పటివరకూ ఈ బాధ్యతను ఈక్వెడార్ నిర్వహించింది. వాతావరణ ప్రతికూల మార్పుల వల్ల జి-77 దేశాలే తీవ్రంగా దెబ్బతింటున్నాయని, ఈ దేశాల్లో తీవ్రస్థాయిలో కరవు కాటకాలు సంభవిస్తున్నాయని తెలిపారు. అలాగే చిన్న చిన్న దీవి దేశాలు ఉప్పెనలు, తుఫాన్ల వల్ల అపారంగా నష్టపోతున్నాయని అన్నారు. భూతాపం పెరిగిపోవడం వల్ల మంచు పర్వతాలు కరిగి సముద్రాల్లో కరగడం వల్ల వాటి ఉపరితలం పెరిగిపోతోందని, దీని పర్యవసానంగానే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు.
77 దేశాల ఈ కూటమిలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న భారత్, చైనాలు పర్యావరణ పరిరక్షణ చర్యల విషయంలో అద్భుతమైన నాయకత్వాన్ని కనబరుస్తున్నాయని అన్నారు. వాతావరణాన్ని పరిరక్షించుకోకపోతే ప్రకృతి విలయాలు, వైపరీత్యాలు సమస్త జీవకోటి జీవనాన్ని కబళించే పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ విషయంలో కొన్ని దేశాలు విఫలమవుతున్నప్పటికీ భారత్, చైనాలు కట్టుదిట్టమైన రీతిలో ప్రకృతి సమతూకాన్ని పరిరక్షించే చర్యలను నిబద్ధతతో చేపడుతున్నాయని అన్నారు.