అంతర్జాతీయం

పాకిస్తాన్‌ది మళ్లీ అదే పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస, జనవరి 27: కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ పాడిన పాటనే మళ్లీ మళ్లీ పాడుతోంది. కాశ్మీర్ వివాద పరిష్కారానికి భారత్ -పాక్‌ల మధ్య మధ్యవర్తిత్వం నెరపే ఆలోచనే లేదంటూ ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తెగేసి చెప్పి రోజులు గడవకముందే మధ్య ఆసియా అంశంపై భద్రతా మండలిలో నిర్వహించిన సమావేశంలో పాక్ దౌత్యవేత కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఐరాసలో పాక్‌కు శాశ్వత ప్రతినిధి అయిన మలీహా లోధి పాలస్తీనా అంశాన్ని కాశ్మీర్‌కు ముడిపెట్టి మాట్లాడటం పాక్ ధోరణిని ప్రతిబింబిస్తోంది. ‘పాలస్తీనియన్ల సార్వభౌమత్వ అభిలాషకు పాక్ మద్దతు పలుకుతోంది. ఎక్కడైనా పరాయి పాలనలో బతుకుతున్న ప్రజల సార్వభౌమత్వ ఆకాంక్షలకు పాక్ ఎప్పుడూ మద్దతిస్తుంది. అది కాశ్మీర్‌లాంటి ప్రాంతమైనా కావొచ్చు’ అంటూ లోధి ప్రస్తావించటం గమనార్హం. ‘పాలస్తీనా విషయంలో ఈ అత్యున్నత కార్యవర్గం తన బాధ్యతలను నిర్వర్తించి తీర్మానాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి. అంతేకాదు, సుదీర్ఘంగా సాగుతోన్న కాశ్మీర్‌లాంటి వివాదాల్లోనూ జోక్యం చేసుకుని పరిష్కారం చూపించినపుడే ఐరాస పట్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది’ అని ఆమె వ్యాఖ్యానించారు. సుదీర్ఘ కాశ్మీర్ వివాదాన్ని భారత్-పాక్‌ల చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి వీలుగా ఐరాస మధ్యవర్తిత్వం నెరపబోతోందన్న కథనాలను కొద్దిరోజుల క్రితమే ఐరాస సెక్రటరీ జనరల్ కొట్టివేసిన విషయం తెలిసిందే.