అంతర్జాతీయం

ఇండో-ఈజిప్టు భాయి భాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైరో, ఫిబ్రవరి 8: భారత్‌కు ఈజిప్టు దౌత్యపరంగా, ఆర్థిక పరంగా మంచి మిత్రదేశమేకాకుండా విస్వసనీయమైన భాగస్వామి అని ఆ దేశంలో భారత రాయబారి సంజయ్ భట్టాచార్య స్పష్టం చేశారు. రాజధాని ఢిల్లీలో మహ్మద్ జకీ ఎల్ సెవడే అధ్యక్షతన జరిగిన ఓ సదస్సులో భట్టాచార్య మాట్లాడుతూ భారత్‌కు ఈజిప్టు సహజ మిత్రదేశమని అన్నారు. పెట్టుబడుల రంగంలోనూ ఇరుదేశాలు పరస్పర సహకారంతోముందుకెళ్తున్నాయని ఆయన చెప్పారు. ఈజిప్టు ఆర్థికాభివృద్ధిలో భారత్ పాత్ర కీలకమైందని భట్టాచార్య అన్నారు. భారత్-ఈజిప్టు రానున్న రోజుల్లో ఉమ్మడిగా మరిన్ని కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తాయని ఆయన ప్రకటించారు. భారత్‌లో పెట్టుబడుల అవకాశాలు పెంపొందించుకునేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్కరణల దిశగా భారత్ దూసుకుపోతోందని మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీలు, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా పథకాలతో ఆర్థిక రంగానికి మరింత వనె్న వచ్చిందని భట్టాచార్య పేర్కొన్నారు.