అంతర్జాతీయం

వీరు అంతర్జాతీయ ఉగ్రవాదులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 8: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలపై డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కొరడా ఝళిపించింది. లష్కరే తోయిబా, తాలిబన్ మిలిటెంట్ సంస్థలకు చెందిన ముగ్గురు తీవ్రవాదులను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదకరమైన వ్యక్తులకు, సంస్థలకు ఏ విధంగానూ ఆశ్రయం ఇవ్వొద్దని పాకిస్తాన్‌కు తెగేసి చెప్పింది. అమెరికా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఫలితంగా రెహ్మాన్ జేబ్ ఫకీర్ మహ్మద్, హిజ్‌బ్‌ఉల్లా, దిలావర్‌ఖాన్ అనే ఈ ముగ్గురు ఉగ్రవాదుల ఆస్తులు జప్తు అవుతాయి. వీరితోగాని, వీరి సారథ్యంలోని సంస్థలతో గాని అమెరికా ప్రజలు ఏ రకంగానూ అమెరికా ప్రజలు లావాదేవీలు జరపడానికి వీలుండదు. ఈ ముగ్గురు ఉగ్రవాదులకు లష్కరే తోయిబా, తాలిబన్లతో సంబంధాలు ఉన్నాయని అమెరికా విదేశాంగ విభాగం స్పష్టం చేసింది. దక్షిణాసియా ఉగ్రవాద నెట్‌వర్క్‌లను దెబ్బతీయాలన్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చేవారిని, అలాగే అక్రమ ఆర్థిక నెట్‌వర్క్‌లను నడిపే వారిని తాము వదిలిపెట్టేది లేదని అమెరికా సీనియర్ అధికారి సిగల్ మండేల్కర్ వెల్లడించారు. అల్‌ఖైదా, లష్కరే తోయిబా, తాలిబన్‌తోపాటు ఇతర ఉగ్రవాద గ్రూపులకు వివిధ రకాలుగా సహాయపడుతున్న వారందరినీ లక్ష్యంగా చేసుకుని తాము చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ఉగ్రవాదులకు ఏ రకంగానూ నిధులు అందకుండా చూడడంతోపాటు దక్షిణాసియాలోని పాకిస్తాన్ సహా ఏ దేశం కూడా వీరికి ఆశ్రయాన్ని కల్పించకూడదని స్పష్టం చేశారు. రెహ్మాన్ జేబ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి కారణం లష్కరే తోయిబాకు ఆయన ఆర్థికంగానూ, సాంకేతికంగానూ సహాయపడడమేనని తెలిపింది. కొనే్నళ్లపాటు లష్కరే తరఫున పనిచేసిన ఆయన నిధులను సేకరించడంతోపాటు గల్ఫ్‌లో ఆ సంస్థకోసం ఓ నెట్‌వర్క్‌ను కూడా నడిపాడని అమెరికా అధికారి తెలిపారు.