అంతర్జాతీయం

అత్యున్నత పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామల్లా, ఫిబ్రవరి 10: పాలస్తీనాలో పర్యటించిన తొలి ప్రధానిగా చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీకి ఆ దేశం సముచితరీతిలో గౌరవించింది. పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌తో ద్వైపాక్షిక చర్చలు పూర్తయిన వెంటనే ఆయనకు ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా’ ప్రదానం చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను సుధృడం చేయడంలో మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ సత్కారం చేశారు. గతంలో ఈ గౌరవం అందుకున్నవారిలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, సౌదీ అరేబియా రాజు సల్మాన్, బహెరైన్ రాజు హమద్ ఉన్నారు. విదేశాలకు చెందిన అధినేతలు, రాజులకు పాలస్తీనా ప్రదానం చేసే అత్యున్నత పురస్కారం ఇది.

చిత్రం..శనివారం రమల్లాలో పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌తో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ