అంతర్జాతీయం

మస్కట్ శివాలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మస్కట్, ఫిబ్రవరి 12: పశ్చిమాసియా దేశాల్లో పర్యటనలో భాగంగా మస్కట్ వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ 125 ఏళ్లనాటి శివాలయాన్ని దర్శించుకున్నారు. దుబాయి నుంచి ఇక్కడకు చేరుకున్న మోదీకి మస్కట్‌లో ఘన స్వాగతం లభించింది. మత్రాహ్ ప్రాంతంలో వేంచేసిన ఆలయాన్ని దర్శించుకుని శివుని ఆశీస్సులు అందుకున్నట్టు ప్రధాని మోదీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘మస్కట్‌లో శివాలయాన్ని సందర్శించి నేనేంతో అనుభూతిని పొందాను. శివుడి ఆశీస్సులు అందుకున్నాను’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘చారిత్రక శివుడి గుడిలో ప్రధాని అభిషేకం చేయించుకున్నారు. మస్కట్ ఆలయ ట్రస్ట్‌బోర్డు సభ్యులతో ముచ్చటించారు’ అని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ వెల్లడించారు. వ్యాపారం నిమిత్తం మస్కట్ వెళ్లిన గుజరాతీలు 125 ఏళ్ల క్రితం ఈ శివాలయాన్ని నిర్మించారు. 1999లో దాన్ని ఆధునీకరించారు.

చిత్రం.దక్షిణాసియా దేశాల పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఒమన్‌లోని
శివాలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్న దృశ్య్ఘ్ఘం