అంతర్జాతీయం

వివాదాస్పద ప్రాంతంలో ఎలా పర్యటిస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఫిబ్రవరి 15: అరుణాచల్ ప్రదేశ్‌లో గురువారం ప్రధాని నరేంద్రమోదీ పర్యటించడంపై చైనా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దక్షిణ టిబెట్‌లో అరుణాచల్ ఒక భాగమని చెప్పిన చైనా ఆ ప్రాంతంలో భారత్ ఎటువంటి చర్యలకు పాల్పడినా ఇరుదేశాల మధ్య ఉన్న ‘సరిహద్దు’ వివాదం మరింత సంక్లిష్టంగా మారుతుందని హెచ్చరించింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ మాట్లాడుతూ దౌత్యపరంగా తమ నిరసనను భారత్‌కు గట్టిగా తెలియచేస్తామని ప్రకటించారు. భారత్‌తో సరిహద్దులపై తమకు స్పష్టమైన, స్థిరమైన హక్కు ఉందని గెంగ్ తెలిపారు. ‘అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ఎప్పుడూ గుర్తించలేదు. భారతదేశ నాయకులు ఆ వివాదాస్పద ప్రాంతంలో పర్యటించడంపై ఎప్పటికప్పుడు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాం’ అని గెంగ్ అన్నట్లు చైనా అధికార వార్తాసంస్థ జిన్హువా పేర్కొంది. సరిహద్దు వివాదాలను పరిష్కరించే దిశగా ఇరుదేశాలు ఒక అవగాహనకు వచ్చాయని, దానిని గౌరవిస్తూ చర్చలు, సంప్రదింపుల ద్వారా ఆయా వివాదాలను భారత్ పరిష్కరించుకోవాలని సూచించిన గెంగ్ ‘మెక్‌మోహన్’ రేఖ, చైనా సంప్రదాయ సరిహద్దుల మధ్య ఉన్న ఈ ప్రాంతం చైనా సొంతమని ఆయన చెప్పుకొచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం 1914లో గుర్తించిన మెక్‌మోహన్ రేఖను చైనా పట్టించుకోవడం లేదు. కాగా అరుణాచల్ ప్రదేశ్‌లో భారతదేశ నాయకులు, విదేశాల ప్రతినిధులు పర్యటించినప్పుడల్లా చైనా తన నిరసనను వ్యక్తం చేయడం సాధారణమే.