అంతర్జాతీయం

బ్లాక్‌మనీ సునామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్యారిస్, ఏప్రిల్ 4: మరో నల్లధన సునామీ ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తోంది. గతంలో వికీ లీక్స్ సృష్టించిన ప్రకంపనలను మించిన స్థాయిలోనే దేశాధినేతలు, వ్యాపార, వాణిజ్య ప్రముఖులు, సెలబ్రిటీల సహా అనేక మందికి నల్లధన మసి అంటిందటూ పనామా పత్రాలు కలకలం రేపుతున్నాయి. తమతమ దేశాల్లో తామే సర్వం అయినా సొంత సొమ్మునే కొల్లగొట్టి పన్నుల ఎగవేత స్వర్గ్ధామాల్లో బూటకపు కంపెనీలు పెట్టారు. ఆ విధంగా స్వదేశీ నిధుల్ని విదేశాలకు తరలించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్, హాలీవుడ్ నటుడు జాకీచాన్, బార్సిలోనా ఫార్వార్డ్ లియోనెల్ మెస్సీ.. ఇలా చెప్పుకుంటూ పోతే 11.5 మిలియన్లు దాటిన పనామా పత్రాల్లో ఉన్నవారి పేర్లకు అంతూ పొంతూ ఉండదు. చరిత్రలో ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా నల్లధన కూపీ లాగే ప్రయత్నం జరగడమే ఇంత భారీ స్థాయిలో అక్రమ కంపెనీల చిట్టా వెల్లడికి కారణం. వందకు పైగా మీడియా సంస్థలతో కూడిన అంతర్జాతీయ పరిశోధన పాత్రికేయుల కన్సార్టియం ఈ ఘనత సాధించింది. తమతమ దేశాల్లో ప్రజల నీరాజనాలందుకుంటున్న వారి ‘మసి’బారిన గతాన్ని బట్టబయలు చేసింది. పనామాకు చెందిన రహస్య ఖాతాల సంస్థ మొసాక్ ఫోనె్సకా నుంచి ఈ పత్రాల్ని సంపాదించిన జర్మనీ దినపత్రిక సూడెషే జీటుంగ్ వీటిని సేకరించి ప్రపంచ వ్యాప్తంగా మీడియాకు విడుదల చేసింది. నాలుగు దశాబ్దాల పాటు అవిశ్రాంత రీతిలో 2లక్షల 14వేల విదేశీ కంపెనీల ఆనుపానులపై ఈ దర్యాప్తు సాగింది. ఈ పనామా సంస్థకు 35దేశాల్లో అనుబంధ సంస్థలున్నాయి. ఈ రహస్య పత్రాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పేరును నేరుగా ప్రస్తావించక పోయినా ఆయన సన్నిహితులు బ్యాంకులు, బూటకపు కంపెనీల ద్వారా 2బిలియన్ డాలర్లను రహస్యంగా రష్యా నుంచి తరలించేశారని ఈ పత్రాలు చెబుతున్నాయి. పాకిస్తాన్, ఐస్‌లాండ్ ప్రధానులు, ఉక్రెయిన్ అధ్యక్షుడు, సౌదీ అరేబియా రాజు, చైనా అథ్యక్షుడు జీ జిన్‌పింగ్ కుటుంబ సభ్యులకూ ఈ నల్లధన ఖాతాలతో సంబంధం ఉన్నట్టు స్పష్టమవుతోంది. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ తండ్రికీ నల్లధన ఖాతాలున్నాయని, ఓ పక్క దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలోనే ఐస్‌లాండ్ ప్రధాని మిలియన్ల కొద్దీ డాలర్ల విలువ చేసే బ్యాంకు బాండ్లను కలిగి ఉన్నారని ఈ పత్రాలు వెల్లడించాయి. ప్రపంచ ఫుట్‌బాల్ నిర్వాహక మండలి ఫీఫా ఎథిక్స్ కమిటీ సభ్యుడు జాన్ పెడ్రోదామియానీకి నల్లధన ఖాతాల రాయుళ్లతో సంబంధం ఉందనీ ఈ పత్రాలు నిగ్గుదేల్చాయి.
ఇంత భారీ స్థాయిలో విదేశీ నల్లధన ఖాతాలకు సంబంధించిన వివరాలు ఎన్నడూ వెల్లడి కాలేదని ఐసిఐజెయూ డైరెక్టర్ గెరార్డ్ రైలే తెలిపారు. ఈ పత్రాల్లో వెల్లడైన వాటిలో చాలావరకూ న్యాయసమ్మతమైన వ్యవహారాలే అయినప్పటికీ ఈ పత్రాల్లో పేర్లు ఉన్న వ్యక్తులపై మాత్రం రాజకీయంగా ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఐస్‌లాండ్ ప్రధాని సిగ్‌ముందర్ డేవిడ్‌పై విపక్షాల నుంచి సెగ మొదలైంది. విన్‌ట్రిస్ అనే కంపెనీని బ్రిటీష్ వర్జిన్ దీవుల్లో ఏర్పాటు చేసి లక్షలాది డాలర్లను తరలించారన్న ఆరోపణల్ని ఆయన ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇతర దేశాల్లో ఏర్పాటు చేసిన కంపెనీలను నిర్వహించడంలో 500లకు పైగా బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలు మొసాక్ ఫోనె్సకాకు సహకరించాయని ఐసిఐజె తెలిపింది. 1970 నుంచీ ఈ వ్యవహారం సాగుతున్నట్టుగా స్పష్టం చేసింది. మే నెల్లో నల్లధన లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను, వీటితో సంబంధం ఉన్నవారి పేర్లనూ బహిర్గతం చేస్తామని స్పష్టం చేసింది.
ఇది ద్రోహం:్ఫనె్సకా
తమ రహస్య పత్రాలు లీక్‌కావడంపై పనామా సంస్థ మండిపడుతోంది. దీన్నో నేరంగా, ద్రోహంగా, పనామాపై జరిగిన దాడిగా రామన్ ఫోనె్సకా పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి నిధుల్ని ఆకర్షించడంలో తాము తీవ్రంగా పోటీపడటాన్ని చూసి ఓర్వని దేశాలే ఈ ద్రోహానికి పాల్పడ్డాయని అన్నారు. మరో పక్క పనామా ప్రభుత్వం కూడా తాజా పరిణామాల్ని తీవ్రంగా పరిగణిస్తోంది. అక్రమ లావాదేవీలను సహించే ప్రసక్తి లేదని, వీటిపై ఎలాంటి దర్యాప్తు జరిగినా పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చింది.

చిత్రం పనామాలో మొసాక్ ఫోనె్సకా న్యాయ కార్యాలయాలున్న భవనం ఇదే.