అంతర్జాతీయం

అతడి ‘జాతకం’ తేల్చేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్: చైనాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. తప్పుడు జాతకం చెప్పిన వ్యక్తి స్టాల్‌పై 70 ఏళ్ల వృద్ధురాలు దాడి చేసి దుకాణం ధ్వంసం చేసింది. చైనా మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం చైనా సిఛౌన్ రాష్ట్రంలోని మియాన్‌యాంగ్‌లో (70) వృద్ధురాలు నివసిస్తోంది. వాంగ్ అనే ఆమెకు ఓ జ్యోతిష్యుడు ‘నీవుఎక్కువ కాలం బతకవని చెప్పేశాడు. ఏడాది చివరినాటికే చనిపోతామని 2018 సంవత్సరం చూడవు’ అని జాతకం చెప్పాడు. అతగాడు చెప్పినవేవీ జరగలేదు. సరికదా సంపూర్ణ ఆరోగ్యంతో భేషుగ్గా జీవిస్తోంది. అప్పటినుంచి వాంగ్ గడిగడి గండం నూరేళ్ల ఆయుష్షుగా గడిపింది. తప్పుడు జోస్యం చెప్పిన వాడిని బుద్ధి చెప్పాలని వాంగ్ నిర్ణయించుకుంది. ‘ఏడాది చివరినాటికే చనిపోతానని చెప్పాడు. జ్యోతిష్యుడి మాటలతో ఏడాదంతా భయం భయంగా గడిపాను. అంత క్షోభకు గురిచేసిన అతడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అందుకే వాడి దుకాణంపై దాడి చేశాను’ అంటూ వాంగ్ వెల్లడించింది. ఇదంతా చైనా మార్నింగ్ పోస్టు ప్రచురించింది. మొత్తానికి స్టాల్‌ను ధ్వంసం చేసి వృద్ధురాలు తన కసి తీర్చుకుంది. విషయం తెలుసుకున్న పోలీసు అధికారి ఒకరు రంగంలోకి దిగి జ్యోతిష్యుడితో వాంగ్‌కు క్షమాపణ చెప్పించారు. కాగా ఆమెకు జాతం చెప్పిన వ్యక్తి ఆషామాషీ జ్యోతిష్యుడుకాదు. చైనాలో అదృష్ట్ఫలాలు చెప్పే ప్రముఖుల్లో ఒకడు కావడం గమనార్హం.