అంతర్జాతీయం

కుప్పకూలిన విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాఠ్మండూ, మార్చి 12: కాఠ్మండూ విమానాశ్రయంలో సోమవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 57మంది దుర్మరణం పాలయ్యారు. యుఎస్- బంగ్లాకు చెందిన ఈ విమానం ఢాకా నుంచి కాఠ్మండూకు వస్తోంది. విమానం త్రిభువన్ విమానాశ్రయంలో దిగే సమయంలో రన్‌వే పైనుంచి జారిపోయి పక్కనే ఉన్న పుట్‌బాల్ మైదానంలో కుప్పకూలిపోయిందని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధి ప్రేమ్‌నాథ్ ఠాకూర్ తెలిపారు. తొలుత 50మంది అక్కడికక్కడే మరణించగా, మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని కాఠ్మండూ మెడికల్ ఆసుపత్రిలో చికిత్సకోసం తరలించారు. వీరందరికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వీరిలో ఏడుగురు మృతి చెందడంతో మొత్తం ప్రమాద మృతుల సంఖ్య 57కు చేరింది. ఢాకానుంచి వస్తున్న ఈ విమానం త్రిభువన్ విమానాశ్రయంలో మధ్యాహ్నం 2.20 గంటలకు దిగింది. తర్వాత విమానం ఫుట్‌బాల్ మైదానంలోకి క్రాష్ కాగానే ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదానికి బహుశా సాంకేతిక లోపాలే కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ‘ఈ విమానానికి రన్‌వే దక్షిణం వైపునుంచి ల్యాండ్ అవడానికి అనుమతినివ్వగా, ఉత్తరం వైపునుంచి దిగింది’ అని నేపాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంజీవ్ గౌతమ్ తెలిపారు. రన్‌వేపై దిగే సమయంలో విమానం అదుపుతప్పిందన్నారు. ఈ విమానం అసాధారణ ల్యాండింగ్‌పై విచారణ జరుపుతామన్నారు. ప్రస్తుతం విమానంలోని మంటలు అదుపులోకి రాగా, సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు.