అంతర్జాతీయం

..చివరికి కాటేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్, మార్చి 17: అతడో సెలబ్రిటీ. ఎలాంటి విషసర్పాన్నయినా అవలీలగా పట్టుకుంటాడు. పాము పడగమీద ముద్దాడుతూ, దాని తనలను నోట్లో పెట్టుకుని ఆడించడం అలవాటు. ఎక్కడ విష సర్పం కనిపించినా క్షణాల్లో అక్కడకు వెళ్లి పట్టుకుని మరీ పాముకోరలు తీసేసేవాడు. అలాంటి వ్యక్తి ఆ పాముకాటుకే బలైపోయిన విషాదం ఘటన మలేసియాలో చోటుచేసుకుంది. అబు జరీన్ హుసీన్ (33) విషసర్పాలతో చేసిన విన్యాసాలు టీవీల్లో, య్యూటూబ్‌ల్లో అనేకం. గత ఏడాది ఆసియా గాట్ టాలెంట్ టెస్ట్‌లో అబు ఇచ్చిన ప్రదర్శన వీక్షకులను నివ్వెర పరిచింది. పాము తలను తన ముక్కుపై రుద్దించుకున్న సన్నివేశం టీవీలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వృత్తిరీత్యా అగ్నిమాపక శాఖ అధికారి అయిన అబు జరీన్ హుసిన్ మలేసియాలో ఓ సెలబ్రిటీ. విషసర్పాలతో ‘ఆడుకునేవాడు’. సెంట్రల్ స్టేట్ పహాంగ్‌కు చెందిన అబు పాముకాటుతో వెనోమ్ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచాడు. సోమవారం నాడు డ్యూటీ నుంచి వచ్చాక వైల్డ్ కోబ్రా ఉందని ఫోన్ వచ్చింది. వెంటనే భార్యతో కలిసి ఆ చోటుకు వెళ్లాడు. విధి వక్రీకరించింది.. ఆ కోడె త్రాచు అబును కాటేసింది. అంతే హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా మృతిచెందాడు. ఎక్కడ ఏ మూలన పాము దాగి ఉన్నా చాకచక్యంగా పట్టుకునే అబు దురదృష్టవశాత్తూ అదే విష సర్పానికి బలైపోయారని కౌలాలంపూర్ ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ ఖిరుద్దీన్ డ్రహమ్ ఆవేదన చెందారు. తాము ఓ టాలెంట్ ఆఫీసర్‌ను కోల్పోయామని ఆయన బాధను వ్యక్తం చేశారు. ప్రాణాంతక విషసర్పాలను ఎలా పట్టుకోవాలో జూనియర్ అధికారులు, తన వద్ద పనిచేసే వారికి చెబుతుండేవాడని ఆయన గుర్తుచేసుకున్నారు. స్నేక్ చార్మర్ అని అందరూ పిలుచుకునే అబు జరీన్ హుసిన్ 2007లో ఓ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాడు. రెండేళ్ల క్రితం ఇతడు తానొక పామును పెళ్లాడానని ప్రకటించి అంతర్జాలంలో సంచలనం అయ్యాడు. ఆ సర్పం చనిపోయిన తన ప్రేమికురాలి పునర్జన్మ అంటూ ప్రచారం చేసుకున్నాడు.