అంతర్జాతీయం
ముస్లిం కనుకే జైలుకు..: పాక్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 6 April 2018
ఇస్లామాబాద్: కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు శిక్షపడటాన్ని తప్పుపట్టిన పాకిస్తాన్ మతం రంగుపులుముతూ వ్యాఖ్యలు చేసింది. సల్మాన్‌ఖాన్ ముస్లిం అయినందువల్లే అతడిని జైలుకు పంపుతూ జోథ్‌పూర్ కోర్టు తీర్పు ఇచ్చిందని, భారత్‌లో ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు భద్రత లేదని పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఖవాజా అసిఫ్ విమర్శలు చేశారు. 20 ఏళ్లనాటి కేసుకు సంబంధించిన తీర్పును ఆయన ఎద్దేవా చేశారు. భారత్‌లో అధికార పార్టీకి చెందిన మతస్తుడై ఉంటే సల్మాన్‌కు ఈ శిక్ష పడి ఉండేది కాదని కూడా ఆయన అన్నారు.