అంతర్జాతీయం

పాక్ న్యాయమూర్తి నివాసంపై కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, ఏప్రిల్ 15: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కేసులో కీలకమైన ఓ జడ్జి ఇంటిపై ఆదివారం ఉదయం కాల్పులు జరిగాయి. తెల్లవారు జామున 4.30 గంటలకు, ఉదయం 9 గంటలకు మరోసారి కాల్పులు జరిగినట్లు లాహోర్ పోలీసులు తెలిపారు. నవాజ్ షరీఫ్‌ను పదవీచ్యుతుడిని చేసిన పనామా పేపర్స్ కేసును విచారిస్తున్న సుప్రీం బోర్డులో న్యాయమూర్తి అయిన ఇజాజ్ ఉల్ హసన్ ఇంటిపై ఈ కాల్పులు జరిగాయి. ఈయన నివాసం లాహోర్‌లోని మోడల్ టౌన్‌లో ఉంది. అయితే ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం గాని, ఎవరికీ ఎటువంటి గాయాలు గాని కాలేదు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మియాన్ సాకిబ్ నిసార్ సంఘటన జరిగిన హసన్ ఇంటికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని పంజా బ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆరిఫ్ నవాబ్ ఖాన్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఫోరెన్సిక్ నిపుణు లు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారని చీఫ్ జస్టిస్ విలేఖరులకు తెలిపారు. పాక్ ప్రధాని షాహిబ్ అబ్బాసీ, పంజాబ్ ముఖ్యమంత్రి షహ్‌బాజ్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. సంఘటనకు నవాజ్ షరీఫ్‌దే బాధ్య త అని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అన్నారు.