అంతర్జాతీయం

చైనాయే అడ్డు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, జూన్ 23: అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో భారత్‌కు సభ్యత్వం కల్పిం చే అంశంపై గురువారం రా త్రి సియోల్‌లో జరిగిన ప్ర త్యేక ప్లీనరీ సమావేశంలో ఏకాభిప్రా యం సా ధ్యం కాలేదు. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేయని దేశాలకు ఎన్‌ఎస్‌జిలో సభ్య త్వం కల్పించడానికి వీల్లేదంటూ చైనా, బ్రెజిల్, ఆస్ట్రియా, న్యూజిలాండ్, ఐర్లాండ్, టర్కీలు గట్టిగా పట్టుబట్టినట్టు తెలుస్తోంది. అయితే ఒక్క చైనా నుంచే తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురైనట్టుగా భారత వర్గాలు వెల్లడించాయి. ఇంతకు ముందు తాష్కెంట్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమైన భారత ప్రధాని మోదీ ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం విషయంలో మద్దతివ్వాలని కోరినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. ఎన్‌ఎస్‌జి ప్లీనరీ అజెండాలో భారత్‌కు సభ్యత్వం కల్పించాలన్న అంశం లేకపోయినా రాత్రి జరిగిన ప్రత్యేక సమావేశంలో దీన్ని చేపట్టారు. ఇందుకు కారణం..జపాన్ తదితర దేశాలు ఈ అంశాన్ని ఎన్‌ఎస్‌జి ప్రారంభ సమావేశంలో ప్రస్తావించడమే. అందుకే రాత్రి భోజనానంతరం ప్రత్యేకంగా సమావేశమై భారత సభ్యత్వ అంశాన్ని చర్చించారు. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ సహా అనేక దేశాలు గట్టి మద్దతును అందించినప్పటికీ ఏకాభిప్రాయ ప్రాతిపదికనే ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం కల్పించాలన్న నిబంధన ఉండటం వల్ల ఎలాంటి ఫలితం లేకపోయింది. శుక్రవారం జరిగే చివరి రోజు సమావేశంలో భారత ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది ఆధారపడి ఉంటుంది. తాష్కెంట్‌లో చైనా అధ్యక్షుడితో మోదీ జరిపిన భేటీ నేపథ్యంలో భారత్‌కు అనుకూలంగా పరిస్థితులు మారతాయని భావించినా..కమ్యూనిస్టు నాయకత్వం పట్టిందే పట్టుగా వ్యవహరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్-ఎన్‌పిటి దేశాలకు మినహాయింపునివ్వడానికి వీల్లేదని చైనా సారథ్యంలో పలుదేశాలు గట్టిగానే వాదించాయి. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ సారథ్యంలో భారత దౌత్యవేత్తలు మద్దతు సమీకరణ ప్రయత్నాలను చివరి క్షణం వరకూ ముమ్మరంగానే కొనసాగించారు. ఈ 48దేశాల కూటమి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన దాదాపు 300మంది ప్రతినిధుల బృందం నేతలను కలుసుకున్నారు. అయితే ఎన్‌పిటిపై సంతకం చేయని దేశాలకు సభ్యత్వం కల్పించాలా వద్దా అన్న అంశాన్ని దాటి చర్చ వెళ్లలేదని, ముఖ్యంగా భారత్‌కు మినహాయింపు ఇచ్చే అంశం శుక్రవారం సమావేశంలో ప్రస్తావనకు రావచ్చునని చెబుతున్నారు.