అంతర్జాతీయం

చట్టబద్ధ వలసలను ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, మే 15: అక్రమ, సక్రమ వలసలను స్పష్టంగా విభజించడంతపై దృష్టి కేంద్రీకరించాలని భారత్ ఐక్యరాజ్య సమితిని కోరింది. అక్రమ వలసదార్ల వల్ల, చట్టబద్ధ వలసదార్లు ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి నెలకొన్నదని భారత్ స్పష్టం చేసింది. అక్రమ వలసదారులు ముఖ్యంగా మానవ అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతుండటం సర్వసాధారణమైపోయిందని ఐక్యరాజ్య సమితిలో భారత్‌కు చెందిన శాశ్వత డిప్యూటీ ప్రతినిధి తన్మయ లాల్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సురక్షితమైన, ఒక క్రమపద్ధతిలో వలసలు సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇక్కడ వివిధ ప్రభుత్వాల మధ్య ఏర్పాటైన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా వలసల గురించి జరిగే చర్చల్లో, అక్రమ వలసలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుండటం దురదృష్టకరమన్నారు. ‘ఇది వలసల సమస్యను పరిష్కరించడానికి ఎంతమాత్రం ఉపయోగపడదు. కానీ చట్టబద్ధంగా వలస వచ్చిన వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. వీరు తమ మాతృదేశానికి, అతిథేయ దేశానికి చేస్తున్న సేవలను గుర్తుంచుకోవాలి,’ అన్నారు. ‘కొన్ని అక్రమ వలసలు ఉన్నాయి. అందులో ఎటువంటి వివాదం లేదు. కానీ వీరి సంఖ్య చాలా తక్కువ. ప్రధానంగా మానవ అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారే వీరిలో అధికం,’ అన్నారు. వచ్చే డిసెంబర్‌లో మోరాకోలోని మర్రకేశ్‌లో జరిగే సమావేశంలో ‘వలసలపై ప్రపంచ దేశాలు సంఘటిత విధానాన్ని’ ఆమోదించనున్నాయి. దీన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితిలో వివిధ ప్రభుత్వాల మధ్య సమావేశం ఏర్పాటైంది. ఈ సందర్భంగా తన్మయలాల్ ప్రసంగిస్తూ ‘దురదృష్ట వశాత్తు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది నేతలు, అనేక సంస్థలు, ఐరాసకు అనుబంధ సంస్థలు అక్రమ, సక్రమ వలసల మధ్య తేడాను చెరిపేయడానికి యత్నిస్తున్నాయి. ఆవిధంగా చేయడం వల్ల చట్టబద్ధంగా ఉంటే వలసదార్ల ప్రయోజనాలు దారుణంగా దెబ్బతింటాయి’ అన్నారు. అయితే అక్రమ వలసదార్ల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిందే.
కానీ ఇదే సమయంలో సక్రమ వలసదార్లను ప్రతికూల దృష్టితో చూడకూడదు. ఆవిధంగా చూడటం వల్ల మనం దేనికోసమైతే పనిచేస్తున్నామో, ఆ ‘సంఘటిత ప్రపంచం’ అంశం ప్రాముఖ్యతను కోల్పోతుందని తన్మయలాల్ అన్నారు. అక్రమ వలసదారులకు ఏవిధమైన హక్కులు కల్పించాలనే దానిపై ప్రస్తుత ముసాయిదా ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తోంది. దీనికి బదులుగా చట్టబద్ధమైన వలసలను ఏవిధంగా ప్రోత్సహించాలన్నదానిపై దృష్టి కేంద్రీకరించాలని లాల్ స్పష్టం చేశారు.