అంతర్జాతీయం

భారత్‌పై దుష్ప్రచార వార్తలు ప్రచురించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 15: భారత్‌పై అమెరికా మీడియా వ్యతిరేక కథనాలను, ప్రతికూల వార్తలను ప్రచురిస్తోందని, అభివృద్ధిని మర్చిపోయి, ఏదో ఒక అరుదైన విషయాన్ని పట్టుకుని గోరంతలు కొండంతలుగా చిత్రీకరిస్తున్నాయని అమెరికాలో భారత రాయబారి నవతేజ్ సింగ్ శర్న అన్నారు. దుష్ప్రచార వార్తలను ప్రచురించరాదని ఆయన కోరారు. అమెరికాకు చెందిన మేధావుల కూటమని సెంటర్ ఫర్ స్ట్రాటేజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సంస్థ ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఒక సామాజిక అంశం, వరకట్నం సమస్యలు ఉన్నాయని చెప్పారు. అభివృద్ధి అంశాలను పట్టించుకోకుండా, చిన్న ఘటన ఏదైనా చోటు చేసుకుంటే దానికి విదేశీ మీడియా ప్రచారం ఇస్తుందన్నారు. ఇటువంటి వార్తా కథనాలను ప్రచురించడం ద్వారా ప్రజలకు మీడియా అన్యా యం చేస్తోందన్నారు. ఈ కథనాలు జర్నలిస్టుల సంకుచిత స్వభావానికి నిదర్శనమన్నారు. భారత్‌పై తప్పుడు కథనాలు ప్రచురించే మీడియా వ్యవహారశైలిని మార్చేందుకు తాను నిరంతరం ప్రయత్నిస్తుంటానని, సరిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలు విఫలమవుతున్నాయన్నారు. వాస్తవిక దృక్పథంతో కూడిన కథనాలను ప్రచురించడం వల్ల అమెరికా గౌరవం ఇనుమడిస్తుందన్నారు.

చిత్రం..వాషింగ్టన్‌లో సదస్సులో మాట్లాడుతున్న భారత రాయబారి నవతేజ్ సింగ్