అంతర్జాతీయం

‘జిఇఎస్’కి పిలిస్తే భారత్‌కు వస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 25: భారత్‌లో వచ్చే ఏడాది జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జిఇఎస్)కు గనుక ఆహ్వానిస్తే తాను భారత్ సందర్శించే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారు. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో మాట్లాడుతూ ఒబామా ఈ విషయం చెప్పారు. ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలందరినీ ఒక వేదికపైకి తేవడానికి ఒబామా వ్యక్తిగతంగా చొరవ తీసుకోవడం వల్లనే జిఇఎస్ ఏర్పాటయింది. ఈ నెల ప్రారంభంలో వైట్‌హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఒబామాతో సమావేశమైనప్పుడు వచ్చే ఏడాది ఈ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తుందని చెప్పడం తెలిసిందే. ఒబామా వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు ఒబామా ప్రభుత్వం భారత్‌కు కృతజ్ఞతలు చెప్పింది కూడా. ‘ఒబామా నాయకత్వంలో చివరిసారిగా మనమంతా జిఇఎస్‌కోసం ఇక్కడ సమావేశమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇది ఇకపై కూడా కొనసాగుతుందని, వచ్చే ఏడాది భారత్‌లో ఇది జరుగుతుందని మీ అందరికీ తెలుసు’ అని గురువారం సదస్సులో మాట్లాడుతూ అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ చెప్పారు. 2010లో మొదటి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు అమెరికాలో జరిగింది. ఆ తర్వాత టర్కీ, యుఏఇ, మలేసియా, మొరాకో, కెన్యా దేశాల్లో ఈ సదస్సు నిర్వహించారు. కాగా, ఈ ఏడాది ఈ సదస్సుకు 170 దేశాలనుంచి 700 పైగా పారిశ్రామికవేత్తలు, 300కు పైగా పెట్టుబడిదారులు హాజరవుతున్నారు. భారత్ కూడా ఈ సదస్సుకు భారీ ప్రతినిధి బృందానే్న పంపింది.

చిత్రం కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ వర్శిటీలో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న ఒబామా, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జుకెర్ బర్గ్