అంతర్జాతీయం

మా ఉత్పత్తుల జోలికొస్తే తెగతెంపులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 3: చైనా సరకులపై టారిఫ్‌ను విధిస్తే భవిష్యత్తులో వాణిజ్య ఒప్పందాలకు స్వస్తి చెబుతామని చైనా అమెరికాను హెచ్చరించింది. చైనా, అమెరికా వాణిజ్య బృందాల మధ్య బీజింగ్‌లో ఇరు దేశాల మధ్య వాణిజ్య సహకారం పెంపొందించుకోవడంపై సమావేశం జరిగింది. చైనా ఉప ప్రధానమంత్రి లీ హీ, అమెరికా వాణిజ్య మంత్రి విల్బుర్ రోస్ పాల్గొన్నారు. చర్చలు అనంతరం ఉభయ దేశాలు ప్రకటన విడుదల చేశాయి. వ్యవసాయం, ఇంధన రంగాల్లో ఉభయ దేశాలకు మధ్య మంచి సహకారం ఉందని, కాని అనేక అంశాలపై చైనా, అమెరికా మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందని ప్రకటనలో పేర్కొనారు. ఇరుదేశాల వాణిజ్య రంగంలో అనవసర పోటీలను నివారించాలని తీర్మానించాయి. కాగా అమెరికా కనుక తమ సరకులపై టారిఫ్‌ను పెంచితే ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాలకు స్వస్తి చెబుతామని ఈ సమావేశంలో చైనా స్పష్టం చేసింది. అమెరికా టారిఫ్‌ను పెంచితే, ఇంతవరకు ఒప్పందాలు సాఫీగా కుదిరేందుకు చేసిన కసరత్తు వృథా అవుతుందని చైనా పేర్కొంది. అమెరికాతో పాటు ఇతర దేశాల నుంచి అవసరమైన ఉత్పత్తుల దిగుమతులు పెంచాలనే యోచనలో చైనా ఉంది. దీనివల్ల చైనాకు విదేశీ మార్కెట్లో పరపతి పెరుగుతుంది. కాగా అమెరికా మాత్రం చర్చలు అనంతరం ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అంతకుముందు చైనా బృందం అమెరికాకు వెళ్లి వాణిజ్య ఒప్పందాలు, ఎగుమతులు, దిగుమతుపై చర్చలు జరిపింది.
అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతిని పెంచుతామని ఇప్పటికే చైనా స్పష్టం చేసింది. కాగా తమతో వాణిజ్య లోటును తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాను హెచ్చరించారు. 2020 నాటికి 200 బిలియన్ డాలర్ల మేర లోటును తగ్గించాలని ట్రంప్ చైనాను కోరారు. దిగుమతులను పెంచుతామని, దీనిపై అనవసర రాద్ధాంతం చేయాల్సిన పనిలేదని చైనా అమెరికాకు స్పష్టం చేసింది. అమెరికా కూడా తమ ఉత్పత్తుల దిగుమతులను పెంచితే, చైనాలో పెట్టుబడులను పెంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఒప్పందాల అమలు ఎలా ఉన్నా, చైనా మాత్రం తమ ఉత్పత్తులపై టారిఫ్‌ను విధిస్తే మాత్రం ఒప్పందాలను సమీక్షిస్తామని నిర్మొహమాటంగా పేర్కొంది.

చిత్రం.. బీజింగ్‌లో చైనా ఉప ప్రధాని లీ హీతో అమెరికా
వాణిజ్య మంత్రి విల్బుర్ రోస్ కరచాలనం చేస్తున్న దృశ్యం