అంతర్జాతీయం

ఉగ్రవాదాన్ని తరిమిగొడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జింగ్‌డావో, జూన్ 10: ఉగ్రవాద, వేర్పాటువాద, తీవ్రవాద గ్రూపు కార్యకలాపాలకు యువతదూరంగా ఉండాలని, ఈ సంస్థల కార్యకలాపాలను తిప్పిగొట్టాలని షాంఘై సహకార సదస్సు డిక్లరేషన్‌లో ప్రకటించారు. షాంఘై సహకార సదస్సుకు చైనా, భారత్, పాకిస్తాన్‌తో పాటు ఎనిమిది దేశాలు అధినేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చేసిన తీర్మానాన్ని షాంఘై సదస్సు విడుదల చేసింది. యువకులు సమగ్ర విద్య, ఆధ్యాత్మిక, నీతివంతమైన విద్యపై దృష్టిసారించాలని, దేశ సమగ్రతకు భంగం కలిగించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిక్లరేషన్‌లో హెచ్చరించారు. జింగ్ డావో డిక్లరేషన్‌పై ఎనిమిది దేశాల అధినేతలు సంతకాలు చేశారు. అనేక ఉగ్రవాద సంస్థలు యువతను తమ ఉచ్చులో లాగేందుకు చేస్తున్న ప్రయత్నాలను విచ్చిన్నం చేయాలని, వీటి వల్ల యువత భవిష్యత్తును కోల్పోతారని షాంఘ్ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. షాంఘై దేశాల మధ్య విద్యా రంగంలో పటిష్టమైన సంబంధాలు నెలకొల్పాలని, భవిష్యత్తు తరాల శ్రేయస్సు దృష్ట్యా ఈవిషయమై సమిష్టిగా పనిచేయాలని కోరారు. రెండు రోజుల పాటు జరిగిన షాంఘై సహకార సదస్సు డిక్లరేషన్ కీలకమైనదని కో ఆర్డినేటర్ మధుమిత హజారికా భగత్ తెలిపారు. ఎనిమిది దేశాలు ఈ డిక్లరేషన్ ప్రాధాన్యతను గుర్తించాయని ఆమె తెలిపారు.

చిత్రం..షాంఘై సహకార సదస్సులో వివిధ దేశాధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ