అంతర్జాతీయం

యూకేలో ఐటీ నిపుణుల కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 14: బ్రిటన్‌లో పనిచేసే, జీవించే హక్కు కోసం పోరాడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన ఐటీ నిపుణుల సమస్యను పరిష్కరించేందుకు పార్టీలతో నిమిత్తం లేకుండా ఎంపీలు ముందుకు వస్తున్నారు. ఈ వారంలో బ్రిటన్ పార్లమెంట్‌లో వీరు ఐటీ నిపుణులకు మద్దతుగా నిలవనున్నారు. పశ్చిమ లండన్‌కు చెందిన వందలాది మంది భారత ఐటీ నిపుణులకు ‘శాశ్వత నివాస హక్కు’ లేదా ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ (ఐఎల్‌ఆర్) మంజూరుకు, యుకె హోంమంత్రిత్వశాఖ అప్రమాణిక కారణాలను చూపుతూ తిరస్కరిస్తుండటం విచారకరమని లేబర్ పార్టీ ఎంపి రూథ్ క్యాడ్‌బరీ అన్నారు. ‘వీరంతా బ్రిటన్‌లో ఐటీ నిపుణుల కొరతను తీర్చడానికి ఇక్కడకు వచ్చారు. మరి వీరికి అప్పీలు చేసుకునే హక్కు లేకపోతే వీరు పనిచేయడం సాధ్యం కాదు. ప్రమోషన్ తీసుకోలేరు. ఫ్లాట్‌ను అద్దెకు తీసుకోవడం సాధ్యంకాదు. డ్రైవింగ్ లైసెన్స్‌లను కూడా కోల్పోతారు,’ అన్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ పార్లమెంట్‌లో, ‘వలస నిబంధనలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. ముఖ్యంగా వీటిల్లోని 322(5) పేరాగ్రాఫ్ వల్ల వీరికి ఐఎల్‌ఆర్ నిరాకరిస్తున్నారు. నిజానికి దీన్ని దేశం నుంచి ఉగ్రవాదులను వెళ్లగొట్టడానికి రూపొందించారు. కానీ ఇదే క్లాజును కారణంగా చూపుతూ, వీరికి హోంశాఖ ఐఎల్‌ఆర్‌ను నిరాకరించడం అన్యాయం. వీరే మంచి మృత్తి నిపుణులు,’ అని క్యాడ్‌బరీ పేర్కొన్నారు.