అంతర్జాతీయం

తప్పుడు వార్తలే మన ప్రధాన శత్రువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 14: కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశం తర్వాత, ఇక అణుభయం లేదని ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు మీడియాపై విరుచుకుపడ్డారు. ఉత్తర కొరియా నియంతతో కుదిరిన ఒప్పందాలను మీడియా తక్కువ చేసి చూపిందంటూ ఆగ్రహం వెళ్లగక్కారు. మంగళవారం ట్రంప్-కిమ్‌ల మధ్య కుదిరిన ఒప్పందం అస్పష్టంగా ఉన్నదంటూ దేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామం ట్రంప్‌కు మింగుడు పడటం లేదు. సింగపూర్‌లో సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఆయన ఎన్‌బీసీ, సీఎన్‌ఎన్‌లపై దాడికి దిగారు. ‘‘ఎన్‌బీసీ, సీఎన్‌ఎన్‌లు ప్రసారం చేసిన వార్తలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఉత్తరకొరియాతో కుదిరిన ఒప్పందాన్ని సాధ్యమైనంత తక్కువ చేసి చూపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 500 రోజుల క్రితం యుద్ధం వస్తుందన్న భయంతో వీరు ఒప్పందం చేసుకోవడం మంచిదని అభ్యర్థించారు. ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న పెద్దశత్రువు ‘తప్పుడు వార్తలే’. కొంతమంది వెర్రివాళ్లు ఇటువంటి వాటిని ప్రసారం చేస్తారు’’ అంటూ ట్వీట్ చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు సీఎన్‌ఎస్ వైట్ హౌజ్ ప్రధాన కరస్పాండెంట్ జిమ్ అకోస్టానుద్దేశించి చేసినవేనని వేరే చెప్పాల్సి పనిలేదు. ఎందుకంటే ఆయన ఈ ఒప్పందానికి వ్యితిరేకంగా కథనాలను ప్రసారం చేశారు. సింగపూర్ అణు ఒప్పందం సందర్భంగా అకోస్టా వేసిన ప్రశ్నలపై కూడా ట్రంప్ అధికార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అకోస్టా ప్రెస్ గుర్తింపులను రద్దు చేస్తూట్రంప్ ప్రచార మేనేజర్ బ్రాడ్ పారస్కేల్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి అకోస్టా ట్విట్టర్‌లో స్పందిస్తూ ‘కేవలం నియంతలు మాత్రమే ప్రెస్ గుర్తింపులను రద్దు చేస్తారు. ప్రజాస్వామ్యంలో కాదు’ అని పేర్కొన్నారు. తన ప్రెస్ గుర్తింపులను తక్షణమే పునరుద్ధరించాలని కూడా కోరారు.