అంతర్జాతీయం

వీసాల జారీలో వివక్షా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: బ్రిటన్ ప్రభుత్వం తాజాగా రూపొందించిన విద్యార్థుల స్టడీ వీసాల జాబితాలో భారత్‌ను చేర్చకపోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. యూకే వర్శిటీల్లో చదువుకునేందుకు వచ్చే విదేశీ విద్యార్థులు వీసా జారీల్లో ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వీసా దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేస్తూ ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు చేస్తూ శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 4 టైర్ వీసా కేటగిరి కింద విదేశీ విద్యార్థులకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు బ్రిటన్ హోమ్ శాఖ ప్రకటించింది. కొత్త జాబితాలో 25 దేశాలను చేర్చారు. ఇప్పటికే అమెరికా, కెనడా, న్యూజిలాండ్ దేశాలు జాబితాలో ఉండగా కొత్తగా చైనా, బహ్రెయిన్, సెర్బియా చేరాయి. ఈ దేశాల నుంచి వచ్చే విద్యార్థులకు అనేక సడలింపులు కల్పించారు. విద్య, ఆర్థిక పరిస్థితి అలాగే ఆంగ్లభాష స్కిల్స్‌పై అంత ఎక్కువ నిబంధనలు ఉండవు. బ్రిటీష్ విశ్వవిద్యాలయాల్లో వారు సులభంగానే ప్రవేశాల పొందవచ్చు. అయితే కొత్త జాబితాలో తమ పేరు చేర్చకపోవడంపై భారత్ తీవ్రంగా మండిపడుతోంది. ‘మా విద్యార్థులు బ్రిటీష్ వర్శిటీల్లో చదవాలంటే కఠిన నిబంధనలు ఎదుర్కోవాలి. డాక్యుమెంట్లు పరిశీలన దగ్గరి నుంచి అన్నింటిలోనూ నిబంధనలు ఎదుర్కోవల్సి ఉంటుంది’ అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 4 టైర్ నిబంధనలు భారతీయ విద్యార్థులు వర్తించకపోవడం అత్యంత దారుణం, దుర్మార్గం అని యూకే కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అఫైర్స్ (యూకేసీఐఎస్‌ఏ) చైర్మన్, భారత సంతతి పారిశ్రామికవేత్త లార్డ్ కరన్ బిల్మోరియా విమర్శించారు. ఇది తమను అవమానించడమేనని అన్నారు. థెరిసామే ప్రభుత్వ తప్పుడు నిర్ణయమని బిల్మోరియా ధ్వజమెత్తారు. అయితే వీసా నిబంధనలు సడలిస్తూ బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని యూకే హోమ్ కార్యదర్శి సాజిద్ జవీద్ సమర్ధించారు. ‘బ్రిటన్‌కు భారత్ ఎప్పటి నుంచో మిత్రదేశం. ప్రపంచంలోనే బ్రిటన్ ఆర్థిక శక్తిగా ఎదగడానికి భారత్ తన తోడ్పాటును అందిస్తోంది’ అని ఆయన బిల్మోరియా విమర్శించారు. బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసించడానికి వచ్చే మూడు దేశాల్లో భారత్ ఒకటని అలాంటిది తమ విద్యార్థులపైనే కత్తిగట్టడం వివక్షేనని నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్, అలుమ్ని యూనియన్ (ఎన్‌ఐఎస్‌ఏయూ-యూకే) అధ్యక్షుడు సనం అరోరా విరుచుకుపడ్డారు. చైనా, యుఎస్ తరువాత బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థులే ఎక్కువ మంది విద్యను అభ్యసిస్తున్నారని ఆయన వెల్లడించారు. కాగా యూకేలో భారత హైకమిషన్ వైకే సిన్హా గత వారం బ్రిటన్ వర్శిటీల మంత్రి శామ్ గైమాతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.