అంతర్జాతీయం

130కి చేరిన బలూచిస్తాన్ మృతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెషావర్, జూలై 14: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో సందర్భంగా జరిగిన మిలిటెంట్ల దాడుల నేపథ్యంలో మృతుల సంఖ్య 130కి చేరుకుంది. మిలిటెంట్ల దాడులకు నిరసనగా ఆదివారం దేశవ్యాప్తంగా సంతాపదినం ప్రకటించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం బలూచిస్తాన్ ఆవామీ పార్టీ (బీఏపీ) నాయకుడు సిరాజ్ రైసానీ మస్తుంగ్ ప్రాంతంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన సందర్భంగా మిలిటెంట్లు జరిపిన భీకర దాడుల్లో దాదాపు 128 మంది మరణించగా, 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మస్తుంగ్‌లోని పీబీ-35 స్థానం నుంచి పోటీ చేస్తున్న బీఏపీ నాయకుడు సిరాజ్ రైసానీ కూడా ప్రాణాలు కోల్పోయాడు. మిలిటెంట్ల దాడుల్లో తీవ్రంగా గాయపడినవారిలో మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది.
బలూచిస్తాన్, ఖైబెర్-పాఖ్‌తున్‌ఖ్వా ప్రాంతాల్లో మిలిటెంట్లు బలూచిస్తాన్ ఆవామీ పార్టీ, ముతాహిదా మజ్లిస్ ఆమల్, దాని అనుబంధ పార్టీలు నిర్వహిస్తున్న ఎన్నికల ర్యాలీలో ఈ దాడులకు తెగబడ్డారు. ఈ రెండు సంఘటనల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ మంగళవారం పెషావర్‌లో, శుక్రవారం మస్తుంగ్, బన్ను ప్రాంతాల్లో టెర్రరిస్టులు జరిపిన దాడుల్లో ఎంతోమంది పౌరులు మరణించిన నేపథ్యంలో ఆదివారం దేశవ్యాప్తంగా సంతాపదినం పాటించాలని కోరింది. ఇదిలావుండగా, ఎన్నికల ర్యాలీలో మరణించిన బలూచిస్తాన్ ఆవామీ పార్టీ నాయకుడు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ క్వామర్ జావెద్ బజ్వా బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాకు చేరుకున్నారు.
టెర్రిరిస్టుల దాడుల్లో అసువులు బాసి క్వెట్టాలోని సీఎంహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆర్మీ చీఫ్ జనరల్ పరామర్శించే అవకాశం ఉంది. కాగా, ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో ప్రజాజీవనంతోపాటు వ్యాపార కార్యకలాపాలు స్తంభించాయి. పట్టణాన్ని హై అలెర్ట్‌గా ప్రకటించిన నేపథ్యంలో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. ఉగ్రవాదుల దాడుల అనంతరం మరిన్ని దాడులకు తెగబడకుండా ఉండేందుకు భద్రతా చర్యలను మరింత ముమ్మరం చేసింది.