అంతర్జాతీయం

ఆత్మాహుతి దాడులను ఎదుర్కొనేందుకు చైనా రోబో సబ్‌మెరైన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా: సాయుధ బలగాలను ఎప్పటికప్పుడు రిక్రూట్‌మెంట్ చేసుకుంటూ మరింత బలపడుతున్న చైనా ఇపుడు సముద్రతీర ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులను ఎదుర్కొనేందుకు రోబోట్ సబ్‌మెరైన్లను వినియోగించే దిశగా ప్రయత్నాలకు సన్నద్ధమవుతోంది. ఆత్మాహుతి దాడులకు పాల్పడేవారిపై నిఘా ఉంచేందుకు కృత్రిమ మేధస్సుతో కూడిన సబ్‌మెరైన్లను రోబోట్‌లు స్వయంగా నడిపే దిశగా ముందుకు వెళ్తోంది. దక్షిణ చైనాలోని మోర్నింగ్ పోస్టులో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం..ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న రోబోట్ సబ్‌మెరైన్లు 2020 నాటికల్లా వినియోగంలోకి తెచ్చేందుకు చైనా యోచిస్తోంది. రోబోట్ సబ్‌మెరైన్ల పరీక్షలు విజయవంతమైతే దక్షిణ చైనా సముద్రతీర ప్రాంతంలో నిఘా వేసేందుకు అత్యంత శక్తివంతమైన దేశంగా ఘనతను దక్కించుకుంటుంది. కాగా, ఇలాంటి సబ్‌మెరైన్లను అమెరికాలో కూడా పరీక్షల దశలో ఉన్నా చైనా తయారుచేసే రోబోట్ సబ్‌మెరైన్ల తయారీకి వినియోగించే సాంకేతిక అంశాలు ఏవిధంగా ప్రయోజనం చేకూర్చుతాయో తేలిన తర్వాత ఆ దిశగా ముందుకు వెళ్లనున్నారు.