అంతర్జాతీయం

పేరు తెచ్చిన తంటా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 2: ఫేస్‌బుక్‌లో ‘ఐసిస్’ పేరుతో ఖాతా తెరిచిన మహిళకు పెద్దచిక్కే వచ్చింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాద సంస్థ పేరూ ‘ఐసిస్’ కావడమే కారణం. యుకెకు చెందిన 27 ఐసిస్ థామస్ అనే ఆమెకు ఫేస్‌బుక్ యాజమాన్యం మెస్సేజ్ పంపింది. ఐసిస్ పేరును నిర్ధారించుకోవాలని, దానికి సంబంధించి ఆధారాలు చూపాలని ఆమెకు విజ్ఞప్తి చేసింది. అలాగే ఐసిస్ పేరుతో తెరిచిన అకౌంట్‌పైనా ఫేస్‌బుక్ ఆంక్షలు విధించింది. బ్రిస్టెయిన్‌కు చెందిన ఐసిస్ థామస్ ఫేస్‌బుక్‌లో ఖాతా తెరిచింది. జూన్ 27న ఖాతా లాగిన్ చేయడానికి ప్రయత్నించగా వచ్చిన మెస్సెజ్ చూసి అవాక్కయింది. ‘నా అకౌంట్ లాగిన్‌కు ప్రయత్నించాను. పాస్‌వార్డ్ ఇస్తుండగా నాకో సందేశం వచ్చింది. చిరునామా మార్చుకోమని అందులో ఉంది’ అని థామస్ పేర్కొంది. తాను ఎప్పటి నుంచో ఐసిస్ పేరును వాడుకుంటున్నానని, మధ్యలో పెట్టుకున్నది కాదని ఆమె స్పష్టం చేసింది. ఆ పేరుతోనే సంతకాలు కూడా చేస్తుంటానని ఆమె తెలిపింది. తాను పేరు మార్చుకునేది లేదని ఆమె అన్నారు. కాగా ఐసిస్ అంటే ఈజిప్టులో దేవత అని అర్థం. అందుకే ఆమె తల్లిదండ్రులు థామస్‌కు ఆ పేరుపెట్టారు.