అంతర్జాతీయం

ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 2: భారత్‌తో దీర్ఘకాలిక వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తామని అమెరికాలోని డెమోక్రటిక్ పార్టీ స్పష్టం చేసింది. భారత్‌ను ‘ముఖ్యమైన పసిఫిక్ శక్తి’గా ఆ పార్టీ తమ ముసాయిదా ఎన్నికల మ్యానిఫెస్టోలో అభివర్ణించింది. అలాగే పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించాల్సిందేనని, ఇందుకు సంబంధించి ఆ దేశంపై ఒత్తిడి తీసుకొస్తామని డెమోక్రటిక్ పార్టీ పేర్కొంది. భారత్‌లో రాజకీయ పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోలను ఆమోదించినట్టుగానే డెమోక్రటిక్ పార్టీ మరికొద్ది రోజుల్లో ఫిలడెల్ఫియాలో సమావేశాన్ని నిర్వహించి తమ ఎన్నికల ముసాయిదా మ్యానిఫెస్టోను ఆమోదించడంతో పాటు ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థిగా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్‌ను నామినేట్ చేయనుంది. ఈ ఎన్నికలకోసం రూపొందించుకున్న ముసాయిదా మ్యానిఫెస్టోను డెమోక్రటిక్ పార్టీ శుక్రవారం విడుదల చేసింది.