అంతర్జాతీయం

తొలిరోజే కాశ్మీర్ సమస్యపై చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 17: పాకిస్తాన్ కొత్త అధ్యక్షుడు ఆరిఫ్ అలీ సోమవారం నిర్వహించిన పార్లమెంటు సంయుక్త సమావేశంలో కాశ్మీర్ అంశంపై ప్రస్తావించారు. అంతర్జాతీయపరంగా సహాయం పొందేందుకు స్వీయ నిర్ణయం తీసుకునేందుకు కాశ్మీరీలకు హక్కు ఉందని ఆయన దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నిర్వహించిన తొలి సమావేశంలో వ్యాఖ్యానించారు. అదేవిధంగా పొరుగు దేశమైన భారత్‌తో తమ దేశం శాంతి సంబంధాలు, సామరస్య పూర్వక వాతావరణాన్ని కోరుకుంటోందని ఆయన నొక్కిచెప్పారు. ఎంతోకాలంగా నలుగుతున్న కాశ్మీర్ సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని తమ దేశం ఆశిస్తోందని ఆయన అన్నారు.