అంతర్జాతీయం

అమెరికా ద్వయానికి అర్థశాస్త్ర నోబెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్‌హోమ్, అక్టోబర్ 8: పర్యావరణ హితంగా సాంకేతిక విజ్ఞానాన్ని మేళవిస్తూ ఆర్థిక వృద్ధిని సాధించవచ్చునంటూ వినూత్న ప్రక్రియను తెరపైకి తెచ్చిన అమెరికా ఆర్థికవేత్తలు విలియం నార్దౌస్ (77), పాల్ రోమర్ (62) ద్వయానికి ప్రతిష్టాత్మక అర్థశాస్త్ర నోబెల్ బహుమతి లభించింది. సాంకేతిక విజ్ఞానం, పర్యావరణ పరిరక్షణను ఆర్థికవృద్ధితో సంధానం చేస్తూ
వీరు చేసిన కృషికి గుర్తింపుగానే ఈ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగిందని నోబెల్ జ్యూరీ ప్రకటించింది. వీరిలో నార్దౌస్ యేల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రపంచబ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేసిన రోమర్ ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన స్టర్న్ బిజినెస్ స్కూల్‌లో పనిచేస్తున్నారు. ప్రకృతి విజ్ఞానంతో సమన్వయంగా మార్కెట్ ఆర్థిక వ్యవస్థ పనిచేసే సరికొత్త నమూనాలను వీరిద్దరూ తెరపైకి తెచ్చారని నోబెల్ అకాడమీ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా వీరి కృషి వల్ల ఆర్థిక విశే్లషణ పరిధి మరింత విస్తృతమైందని, సుస్థిర అభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసే మార్గాలు సుగమం అయ్యాయని తెలిపింది. దీర్ఘకాల స్థూల ఆర్థిక విశే్లషణలతో సాంకేతిక ఆవిష్కరణలను రోమర్ సమీకృతం చేశారని తెలిపింది. గత కొంతకాలంగా వీరి కృషికి గుర్తింపుగా అర్ధశాస్త్ర నోబెల్ బహుమతి దక్కుతుందన్న ఊహాగానాలను నిజం చేస్తూ ఈ పురస్కారాలు లభించడం విశేషం.