అంతర్జాతీయం

లిఖితపూర్వకంగా ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, అక్టోబర్ 8: దేశద్రోహం, ముంబయిపై ఉగ్రదాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, షాహిద్ ఖఖాన్ అబ్బాసీ కేసులు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలంటూ ఫెడరల్ ప్రభుత్వాన్ని లాహోర్ కోర్టు ఆదేశించింది. ఇరువురు మాజీ ప్రధానులపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్లను సోమవారం కోర్టు విచారించింది. నవాజ్, అబ్బాసీతోపాటు డాన్ పత్రికకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు సిరిల్ ఆల్‌మెయిడాపైనా అభియోగాలు నమోదయ్యాయి. ఇద్దరు మాజీ ప్రధానులతో పాటు సిరిల్ కూడా హైకోర్టు ఫుల్ బెంచ్ ఎదుట హాజరయ్యారు. జస్టిస్ మజహర్ అలీ నఖ్వీ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కేసును విచారించింది. కేసును ఈనెల 22కు వాయిదా వేసిన బెంచ్ ముగ్గురినీ లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఆర్టికల్ 6 కింద రాజ్యద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని డిప్యూటీ అటార్నీ జనరల్ మియాన్ తారిఖ్‌ను కోర్టు ప్రశ్నించింది. కేసు విచారణ ఎంతవరకూ వచ్చిందని బెంచ్‌లో సభ్యుడు జస్టిస్ జహంగీర్ అడిగారు. పాత్రికేయుడి నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను కోర్టు ఉపసంహరించుకుంది. సివిల్ సొసైటీ సభ్యురాలు అమీనా మాలిక్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ముంబయిపై ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాదుల పాత్రను తోసిపుచ్చలేమంటూ నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది మేనెలలో డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో 2008 ముంబయి దాడుల విషయాన్ని షరీఫ్ ప్రస్తావించారు. మూడు సార్లు ప్రధానిగా చేసిన నవాజ్ షరీఫ్ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం రాజ్యద్రోహమని పిటిషనర్ ఆరోపించారు. బద్దశత్రువైన దేశం గురించి ఆయనీవిధంగా మాట్లాడడం తగదని ఆమె అన్నారు. నవాజ్ షరీఫ్ తరువాత అధికారం చేపట్టిన అబ్బాసీ కూడా జాతీయ భద్రత సలహా మండలి సమావేశంలో తప్పుదోవపట్టింటే వ్యాఖ్యలు చేశారని అమీనా మాలిక్ ఆరోపించారు.