అంతర్జాతీయం

చట్టబద్ధ ఇమ్మిగ్రేషన్‌కు త్వరలో అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 27: న్యాయ చట్టబద్ధంగా ఇమ్మిగ్రేషన్ కోసం వేచి చూస్తున్న వారికి తప్పనిసరిగా అనుమతులు ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అన్నరు. లక్షలాది మంది ప్రజలు అమెరికా నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. శనివారం ఇకడ ఉత్తర కరోలినాలో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, అమెరికా సరిహద్దులు బలంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. డెమాక్రట్లకు ఓటు వేయడమంటే సరిహద్దులను బాహాటంగా తెరిచినట్లేనన్నారు. పన్నులు పెంచే వారికి మద్దతు ఇవ్వరాదన్నారు. సరిహద్దులను అందరికీ స్వాగతంపలికే విధంగా ఉంచితే ఏమి జరుగుతుందో ప్రజలకు తెలుసన్నారు. ఈ విధంగా చేస్తే తాను విఫలనాయకుడవుతానన్నారు. మెక్సికోతో ఉన్న దక్షిణ సరిహద్దు వద్ద మిలిటరీ బలగాలను మెహరించడాన్ని ఆయన సమర్థించారు. మూడు అమెరికా దేశాల నుంచి ఏడు వేల మంది అమెరికాలో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉందన్నారు. వీరిలో దక్షిణాసియాకు చెందిన కొంత మంది ప్రజలు ఉన్నారన్నారు. మిలియన్ల మంది చట్టబద్ధంగా అమెరికాలో ప్రవేశించేందుకు వేచిచూస్తున్నారని, ఇందులో నిజమైన వారిని ఆహ్వానిస్తామన్నారు. మన చట్టాలు అపహాస్యం కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.