అంతర్జాతీయం

ఖలీదా జియాకు ఏడేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా: మరో అవినీతి కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు ఏడుసంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఒక చారిటబుల్ ట్రస్టు నుంచి తన భర్త పేరున మిలియన్ డాలర్లు వసూలు చేశారన్న ఆరోపణ రుజువు కావడంతో ఆమెకు కోర్టు ఈ శిక్ష విధించింది. ఇప్పటికే అస్వస్థతతో బాధపడుతున్న ఆమెకు అవినీతి కేసులో శిక్ష పడటం ఈ ఏడేళ్లలో ఇది రెండోసారి. తన ఐదేళ్ల పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసిన తర్వాత తన దివంగత భర్త , ప్రెసిడెంట్ జియావుర్ రెహమాన్ పేరుతో అనాథలకు చెందిన నిధులను స్వాహా చేశారన్న ఆరోపణలపై ఖలీదా జియా (73)కు శిక్షపడి జైలు శిక్ష అనుభవిస్తోంది. ఇప్పుడు జియా చారిటబుల్ ట్రస్టు పేరుతో జరిగిన మిలియన్ల అక్రమాలలలో సైతం ఆమె పాత్ర ఉందని రుజువై కోర్టు శిక్ష పడటంతో ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఆమె పాత్రపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ కేసులో జియా, మరో ముగ్గురు అధికారాన్ని దుర్వినియోగం చేసి 375000 యూఎస్ డాలర్లను ట్రస్టుపేరిట వసూలు చేశారు. దీనిపై దాఖలైన కేసును విచారించిన జడ్జి మహ్మద్ అక్తరుజ్జమాన్ తన తీర్పును ఆమె లేకుండానే వెలువరించారు. ఏంటీ కరప్షన్ కమిషన్ 2011లో దాఖలు చేసిన ఈ కేసులో జియారాజకీయ వ్యవహారాల కార్యదర్శి హరీష్ చౌదరి, జియావుల్ ఇస్లామ్ మున్నా, ఢాకా మాజీ మేయర్ వ్యక్తిగత కార్యదర్శి ఇస్లామ్‌ఖాన్ లకు కూడా శిక్ష పడింది. వీరందరూ 10 లక్షల టాకాలు చెల్లించాలని జరిమానా విధించారు. తీర్పును జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బిఎన్‌పి) ఖండించింది. ఈ తీర్పు రాజకీయ ప్రేరేపితమైనదని, తమ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లామ్ అలంఘిర్ తెలిపారు.