అంతర్జాతీయం

చైనాలో టైఫూన్ బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూలై 9: చైనా తూర్పు తీరంలో టైఫూన్ కల్లోలం సృష్టించింది. సుమారు 4 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. బలమైన గాలులు, భారీ వర్షాలతో అతలాకుతలమైందని అధికారులు తెలిపారు. టైఫూన్ తీవ్రత దృష్ట్యా ఈ ఏడాది తొలిసారి రెడ్ అలెర్ట్ ప్రకటించారు. చైనా స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 1:45కి ఫుజియన్ ప్రొవిన్స్‌లోని షిషి నగరంలో గాలులు మొదలయ్యాయి. అవి మరింత బలపడి గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వీచాయి. వేటకు వెళ్లిన మత్స్యకారులు 33,200 మందిని వెనక్కిరప్పించారు. లోతట్టు ప్రాంతాల నుంచి నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. రవాణా వ్యవస్థ అస్తవ్యవస్తమైంది. కనీసం 100 రైళ్ల సర్వీసులను రద్దుచేశారు. రోడ్లపై ఎక్కడి ట్రాఫిక్ అక్కడ నిలిచిపోయినట్టు చైనా అధికార వార్తా సంస్థ జిన్‌హువా పేర్కొంది. టైఫూన్ నెపార్టక్‌తో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. తీరానికి ముప్పు పొంచిఉందని స్టేట్ ఒషానిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్‌ఓఏ) అప్రమత్తం చేసింది.
తీరంలో తొమ్మిది మీటర్లకంటే ఎత్తుగా అలలు లేచే అవకాశం ఉందని ఎస్‌ఓఏ తెలిపింది. స్థానిక వరద నిరోధక కేంద్రాలను అప్రమత్తం చేశారు. గత కొన్ని వారాల క్రితం సంభవించిన టైఫూన్‌కు 160 మంది మృతిచెందగా, 28 మంది ఆచూకీ గల్లంతయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందుజాగ్రత్తలు తీసుకుంది.