అంతర్జాతీయం

ట్రంప్ పట్టు నిలిచేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుకుబడికి సవాల్‌గా మారిన మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ సత్తా ఏమిటో తేలబోతోంది. గత రెండేళ్లుగా ప్రతికూల విధానాలతో ఇటు దేశీయంగా, అటు అంతర్జాతీయంగా వ్యతిరేకతను కొనితెచ్చుకున్న ట్రంప్ ఏ మేరకు అమెరికా ప్రజల మద్దతు చూరగొంటారన్న విషయం సెనేట్, ప్రతినిధుల సభకు జరుగుతున్న ఈ ఎన్నికలు నిరూపించనున్నాయి. దీనికి సంబంధించిన మంగళవారం జరిగిన ఓటింగ్‌లో ప్రజలు భారీ సంఖ్యలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. చివరి క్షణంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అధ్యక్షుడు ట్రంప్ విస్తృత స్థాయిలోనే ప్రచారం సాగించారు. ప్రతినిధుల సభలో మెజారిటీని కాపాడుకోవడమే లక్ష్యంగా అమెరికన్లను ఆకట్టుకునేందకు ఇమ్మిగ్రేషన్ సహా అనేక అంశాలపై ట్రంప్ వివాదాన్ని రేకెత్తించడం గమనార్హం. 435 మందిని ప్రతినిధుల సభకు, 35 మందిని సెనేట్‌కు ఈ ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకుంటారు. అలాగే మరో 36 రాష్ట్రాల గవర్నర్ పదవులకు, శాసన సభ సభ్వత్వాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సెనేట్, ప్రతినిధుల సభలో అధికార రిపబ్లికన్లకే మద్దతు ఉంది. అయితే సెనేట్ మాట ఎలా ఉన్నా ప్రతినిధుల సభలో మాత్రం డెమోక్రటిక్ పార్టీ మెజారిటీ సాధించే అవకాశం ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇమ్మిగ్రేషన్, హెల్త్‌కేర్, ఉపాధి కల్పనే ప్రధాన ఎన్నికల అంశాలుగా ఉన్నప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో తాము ట్రంప్‌కు అనుకూలమా? వ్యతిరేకమా? అన్న అంశానే్న ప్రజలు తేల్చబోతున్నారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల్లోనూ ట్రంప్ తన పార్టీ మెజారిటీని కాపాడుకుంటారా అన్నది చర్చనీయాంశగా మారింది.