అంతర్జాతీయం

ఐరాసకు భారత్ ఆర్థిక దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస, నవంబర్ 6: ఐక్యరాజ్య సమితి, దాని కి చెందిన వివిధ సంస్థలకు, అది చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు భారతదేశం 13.36 మి లియన్ అమెరికా డాలర్లను విరాళంగా అందజేసిందని, యూఎన్ ఇండియన్ మిషన్ పర్మినెంట్ సెక్రటరీ మహేష్‌కుమార్ తెలిపారు. సోమవారం ఇక్కడ జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి తన కార్యకలాపాలను నిర్విఘ్నంగా నిర్వహించడానికి ఆర్థికపరమైన తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఐరాస స్థాపించినప్పటి నుంచి భారత్ దానికి తగిన విధంగా ఆర్థికపరమైన సహకారం అందిస్తోందని ఆయన చెప్పారు. యూఎన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు 4.5 మిలియన్ డాలర్లు, ఈశాన్యంలోని యూఎన్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీకి ఐదు మిలియన్ డాలర్లు, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌కు 1.92 మిలియన్ డాలర్లు, యూఎన్ చిల్డ్రన్స్ ఫండ్‌కు 790000 డాలర్లు, యూఎన్ పాపులేషన్ ఫండ్‌కు 500000 డాలర్లు అందజేసినట్టు ఆయన వివరించారు. ఇవేకాక భారత్ ప్రత్యేకంగా పలు యూఎన్ వాలంటీర్లు, ఇతర సంస్థలకు పెద్దమొత్తంలో నిధులను అందజేసిందని ఆయన చెప్పారు. ఈ సందర్భగా 19 దేశాల వారు 425.69 మిలియన్ డాలర్లను ఐరాసకు సహాయంగా అందజేశారు. ఇది 2017లో వసూలైన 398.98 మిలియన్ డాలర్లకంటే ఎక్కువని ఆపరేషనల్ ఏక్టివిటీస్ చీఫ్ జిమా వౌనియా తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చే విరాళాల కన్నా మానవతా దృష్టితో చేపట్టే కార్యక్రమాలకే ఇస్తున్న విరాళాల మొత్తం గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చే విరాళాల శాతం 10 శాతం పెరగగా, పరోపకార కార్యక్రమాలకు ఇచ్చే విరాళాల శాతం 65 శాతం పెరిగిందని వివరించారు.